S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/26/2017 - 02:21

హైదరాబాద్/ నార్సింగి, నవంబర్ 25: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఇవాంక ట్రంప్‌కు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన గోల్కొండ కోటలో విందు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేపథ్యంలో జీఈఎస్ సదస్సుకు విచ్చేస్తున్న అతిథులకు గోల్కొండ కోటలో ఈనెల 29న సాయంత్రం విందు ఏర్పాట్లు చేస్తున్నారు.

11/25/2017 - 04:13

హైదరాబాద్, నవంబర్ 24: మెట్రోరైలు చార్జీలను ఒకటి రెండు రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టితో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే చార్జీలు కూడా ముందుగానే ఖరారు అయ్యాయి. అయితే గతంలో ఖరారు చేసిన చార్జీలను యధాతథంగా అమలు చేయాలా? లేక తాజాగా ఎల్ అండ్ టి సంస్థ చార్జీలను స్వల్పంగా పెంచాలని చేసిన ప్రతిపాదన మేరకు ఖరారు చేయాలా?

11/25/2017 - 02:59

హైదరాబాద్, నవంబర్ 24: సునామి హెచ్చరికలు జారీ అయితే, ముందస్తుగా ఏం చేయాలి, ఎంత వేగంగా స్పందించాలనే అంశంపై భారత భూగోళ శాస్త్రం నిర్వహించిన సునామీ మెగా మాక్ డ్రిల్ తూర్పు కోస్తా తీరంలోని 35 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశం మేరకు భూగోళ శాస్త్రం పరిధిలోని భాతర జాతీయ సముద్ర విజ్ఞాన కేంద్రం, జాతీయ ప్రకృతి వైపరీత్యాల సంస్థ సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్‌ను శుక్రవారం నిర్వహించాయి.

11/25/2017 - 02:57

ఖమ్మం, నవంబర్ 24: మారుతున్న కాలానికి అనుగుణంగా పొలం పనులకు వెళ్ళే గ్రామీణ కూలీలు కూడా తగ్గుతున్నారు. ఒకప్పుడు సాగులో మహిళలే కీలకంగా ఉండగా మారుతున్న ఆధునిక యుగంలో వారు దానిపట్ల ఆసక్తి కనబర్చడం లేదు. నీతి అయోగ్ అధ్యయనంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.

11/25/2017 - 02:57

హైదరాబాద్, నవంబర్ 24: ఈ నెల 6వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడోసారి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ సిబిఐ కోర్టు విచారణకు ఆయన శుక్రవారం హాజరయ్యారు. అనంతరం ఆయన సాయంత్రం కర్నూలు జిల్లా పాదయాత్రకు బయలుదేరి వెళ్లారు.

11/25/2017 - 02:15

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్య శుక్రవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.

11/25/2017 - 01:53

హైదరాబాద్, నవంబర్ 24: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో మైలురాయిని దాటింది. కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ నుంచి శుక్రవారం అంతిమ అనుమతి లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టును కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు అని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

11/25/2017 - 01:51

నల్లగొండ, నవంబర్ 24: యాదాద్రి ఆలయం అభివృద్ధి పనులను అన్ని ప్రభుత్వ శాఖలూ వేగవంతంగా పూర్తి చేసి దేశంలోనే అద్భుత ‘ఆలయ నగరి’గా రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం కేసీఆర్ ఆలయ పనుల్లో పురోగతిని పరిశీలించి అధికారులతో సమీక్షించారు.

11/25/2017 - 01:43

సిద్దిపేట/ కొండపాక, నవంబర్ 24 : సాంకేతిక లోపంతో ఎయిర్ జెట్ శిక్షణ విమానం కూలిపోయన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద శుక్రవారం జరిగింది. శిక్షణ పొందుతున్న పైలట్ రాశీ రేహనా ప్యారాచూట్ సహాయం తో కిందకు దూకటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

11/25/2017 - 01:41

విశాఖపట్నం, నవంబర్ 24: పార్టీని గాడిలోపెట్టి, 2019 ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగురవేసేందుకు వైసీపీ అధినేత ఓపక్క పాదయాత్ర చేస్తుంటే, మరోపక్క ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి ఎగిరిపోతున్నారు. గడచిన మూడు సంవత్సరాల్లో వైసీపీ నుంచి సుమారు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా టీడీపీలో చేరిపోతున్నా, ఆత్మరక్షణ కోసం జగన్ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.

Pages