S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/08/2017 - 01:37

హైదరాబాద్, అక్టోబర్ 7: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌తో పాటు షూటింగ్‌ల కోసం సింగిల్ విండో అనుమతులను అందించే ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించినట్టు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన లాంఛనంగా టిఎస్ బాక్సాఫీస్ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.

10/08/2017 - 01:35

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ వస్తే రెండో పంటకూ నీరు ఇచ్చుకునే విధంగా నీటిపారుదల వ్యవస్ధను మార్చుకుంటామనే మాట నిజమవుతోంది. పాత నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రైతుల చిరకాల వాంచ అయిన రెండో పంటకు నీరందే స్వప్నం నెరవేరుతోంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సింగూరు ద్వారా రెండో పంటకు అవసరమైన నీరు అందించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

10/08/2017 - 01:33

హైదరాబాద్, అక్టోబర్ 7: ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశాన్ని ముఖ్యమంత్రి శనివారం పరిష్కరించారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి, న్యాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులతో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒకేసారి ఏకంగా 275మందికి నాన్ కేడర్ ఎస్పీలుగా, ఏఎస్పీలుగా, డిఎస్పీలుగా పదోన్నతులు కల్పంచాలని నిర్ణయించారు.

10/08/2017 - 01:32

హైదరాబాద్, అక్టోబర్ 7: జోనల్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న జోన్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా రాష్టప్రతి కొత్తగా ఉత్తర్వులు జారీ చేయమంటూ కోరాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కె.

10/08/2017 - 01:21

చిత్తూరు, అక్టోబర్ 7: వరద ఉద్ధృతికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందులో ముగ్గురి మృత దేహాలు లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. మండల సరిహద్దు ప్రాంతమైన తమిళనాడుకు చెందిన వళ్లిమలయార్‌వీడు గ్రామానికి చెందిన పార్తిబన్ (35) టైలర్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

10/08/2017 - 01:20

రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలు ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జిల్లాల్లో సాగును సస్యశ్యామలం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 71.653 టిఎంసి జలాలు వినియోగించారు. రోజుకు సరాసరిగా సుమారు 8400 క్యూసెక్కుల

10/08/2017 - 01:18

అమరావతి, అక్టోబర్ 7: రైతు కళ్లలో నీళ్లు తుడిచేందుకే రుణమాఫీ అని సిఎం చంద్రబాబు అన్నారు. రైతు సంతోషమే జాతికి ముఖ్యం.. అన్నదాతను ఆదుకోవడం మన బాధ్యత అన్నారు. 3వ విడత రుణ ఉపశమన పత్రాల పంపిణీ సందర్భంగా శనివారం తన నివాసం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సిఎం మాట్లాడుతూ రైతుల రుణభారం రూ.24 వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోందన్నారు.

10/08/2017 - 01:16

అనంతపురం, అక్టోబర్ 7 : అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండల పరిధిలోని మడినేహళ్లి గ్రామంలో శనివారం డెంగ్యూ లక్షణాలతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మడినేహళ్లి గ్రామంలో గత వారం రోజుల నుంచి విషజ్వరాలు ప్రబలాయి.

10/08/2017 - 01:05

అమరావతి, అక్టోబర్ 7: విద్యుత్ రంగంలో ఆంధ్ర సాధించిన విజయాలు దేశానికి దిక్సూచిగా నిలిచిందని కేంద్రం ప్రశంసించింది. తక్కువ చార్జీలకే నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి విధానాలను కేంద్ర మంత్రి అభినందించారు.

10/07/2017 - 01:51

కొత్తగూడెం, అక్టోబర్ 6: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తొమ్మిది ఏరియాల్లో విజయం సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. 11 ఏరియాల్లో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు గట్టి పోటీ ఇచ్చిన ఎఐటియుసి రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

Pages