S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/06/2018 - 01:27

విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో జల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణకు మరోసారి ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఈనెల 12నుంచి జూన్ 7 వరకు 116 రోజులపాటు ‘జల సంరక్షణ ఉద్యమ స్ఫూర్తి -రెండో దశ’ పేరుతో పనులు చేపట్టాలని సూచించారు.

02/06/2018 - 01:16

అమరావతి, ఫిబ్రవరి 5: మిత్రపక్షమైన తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ మధ్య మిత్రభేదం ముదురు పాకాన పడింది. రెండు ఎకరాలతో వచ్చిన వాళ్లు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తారంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్టవ్య్రాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశాయి. సోముకు కౌన్సిలర్‌గా గెలిచే దమ్ములేదని, ఆయన వైసీపీ ఏజెంటంటూ తెదేపా మండిపడింది. దీనిపై ఆగ్రహించిన వీర్రాజు..

02/06/2018 - 03:53

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం డెరెక్టర్ పురుషోత్తమ్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది. ఇటీవల పురుషోత్తమ్‌రెడ్డి ఇంటికి వెళ్లిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు తాళం వేసి ఉండడంతో ఆ ఇంటిని సీజ్ చేశారు. హైదరాబాద్, ఇంకా పలుచోట్ల ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో సోదా నిర్వహించారు.

02/06/2018 - 02:31

హైదరాబాద్, ఫిబ్రవరి 5: అంతరించిపోతున్న కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని కల్పించనున్నట్టు బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. సోమవారం సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక శిక్షణ పొందిన నాయా బ్రాహ్మణులకు చెందిన 138 మంది యువతీ, యువకులకు కిట్‌లు, ధృవపత్రాలు అందజేశారు.

02/06/2018 - 01:49

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించాలని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పునరుద్ఘాటించారు.

02/05/2018 - 04:51

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4: ప్రాచీన సాంస్కతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఎనిమిది గంటల పాటు నిర్విరామ శాస్ర్తియ, జానపద నృత్యాలు కోలాహలంగా సాగాయి. రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ‘నృత్య భారతి-రాజమహేంద్రవరం’ పేరిట గిన్నిస్ తెలుగు వరల్డ్ రికార్డు కోసం 333 మంది శాస్ర్తియ నృత్య కళాకారులు విలక్షణ రీతిలో తమ ప్రతిభా కౌశల్యాన్ని ప్రదర్శించారు.

02/04/2018 - 03:20

శ్రీశైలం టౌన్, ఫిబ్రవరి 3: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబవుతోంది. ఈనెల 6 నుంచి 16 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక వాహనసేవలు ఉంటాయి. 6వ తేదీ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 7వ తేదీ భృంగివాహన సేవ, 8న హంసవాహనం, 9న మయూర వాహనం.

02/04/2018 - 02:47

నల్లగొండ, ఫిబ్రవరి 3: సంచలనం రేపిన నల్లగొండ టూటౌన్ సీఐ ఎన్. వెంకటేశ్వర్లు అదృశ్యం కేసు సుఖాంతమైంది. శనివారం సీఐ తన టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి డ్యూటీలో చేరడంతో రెండు రోజులుగా సీఐ అదృశ్యంపై రేగిన ఉత్కంఠకు తెరపడింది.

02/04/2018 - 02:38

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన అనంతరం ప్రజల నుండి వచ్చిన సమస్యలపై జనసేన పార్టీ గత కొద్ది రోజులుగా మేథోమదన సమీక్ష నిర్వహిస్తోంది. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలను, అవసరాలను నొక్కి చెప్పేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు. ఇందుకు ఇప్పటికే ప్రధాని కార్యాలయాన్ని కోరినట్టు సమాచారం.

02/04/2018 - 02:16

గుంటూరు, ఫిబ్రవరి 3: ప్రపంచ దేశాల్లో భవిష్యత్ భారత్‌దేనని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం గుంటూరుజిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నగరంలోని జేకేసీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కలసి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

Pages