S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/25/2017 - 01:43

సిద్దిపేట/ కొండపాక, నవంబర్ 24 : సాంకేతిక లోపంతో ఎయిర్ జెట్ శిక్షణ విమానం కూలిపోయన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద శుక్రవారం జరిగింది. శిక్షణ పొందుతున్న పైలట్ రాశీ రేహనా ప్యారాచూట్ సహాయం తో కిందకు దూకటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

11/25/2017 - 01:41

విశాఖపట్నం, నవంబర్ 24: పార్టీని గాడిలోపెట్టి, 2019 ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగురవేసేందుకు వైసీపీ అధినేత ఓపక్క పాదయాత్ర చేస్తుంటే, మరోపక్క ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి ఎగిరిపోతున్నారు. గడచిన మూడు సంవత్సరాల్లో వైసీపీ నుంచి సుమారు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా టీడీపీలో చేరిపోతున్నా, ఆత్మరక్షణ కోసం జగన్ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.

11/25/2017 - 01:35

హైదరాబాద్, నవంబర్ 24: హైదరాబాద్‌కు తలమానిక సదస్సుగా మారనున్న జీఈఎస్ ప్రపంచ మహిళా శక్తికి, యుక్తికీ కూడా వేదిక కాబోతోంది. భిన్న రంగాల్లో అద్భుత, అనన్య సామాన్య విజయాలు సాధించిన మహిళల విజయగాధలకూ ఇదే స్ఫూర్తిదాయక వేదిక. అవగాహన, ఆలోచనే విజయాలకు సోపానం. వాటిని పరస్పరం పంచుకుంటేనే అది స్ఫూర్తిదాయక విజయం..తమతో పాటు మరి కొందరూ అదే విజయబాటలో రాణించేందుకు తోడ్పడే విజయసూత్రం.

11/25/2017 - 01:33

అమరావతి, నవంబర్ 24: దస్త్రాల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 20 ఏళ్ల క్రితం తీసుకువచ్చిన సంస్కరణల వల్ల ఈ రోజు హైదరాబాద్ పొందుతున్న ఫలితాలు కళ్లముందే ఉన్నాయని చెబుతూ, అంతకంటే ఉన్నత సంస్కరణలతో రాష్ట్రం దూసుకెళ్లడానికి చేస్తున్న కృషికి చేదోడువాదోడుగా నిలవాలని ప్రభుత్వ యంత్రాంగానికి పిలుపునిచ్చారు.

11/25/2017 - 00:03

తిరుపతి, నవంబర్ 24: వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరానికి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం కోసం ఆన్‌లైన్‌లో కేటాయించే టిక్కెట్లను శనివారం విడుదల చేస్తున్నట్లు టీటీడీ పౌరసంబంధాల శాఖ ముఖ్య అధికారి డాక్టర్ తలారి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ద్వాదశి పర్వదినాన భక్తులు స్వామివారిని రూ.300 ప్రత్యేక దర్శనంలో దర్శించుకోవడానికి వీలుగా 5 వేల టిక్కెట్లను కేటాయించామన్నారు.

11/25/2017 - 03:08

తిరుపతి, నవంబర్ 24: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార కార్యక్రమంలో మనగుడి కార్యక్రమానికి ప్రత్యేక స్థానం ఉందని, సనాతన ధర్మాన్ని మరింతగా వ్యాప్తిచేసేందుకు ఇది దోహదపడుతుందని టీటీడీ ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం మనగుడి పూజాసామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

11/25/2017 - 03:09

విశాఖపట్నం , నవంబర్ 24: లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారానికి (2018) ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు మీగడ రామలింగస్వామిని ఏంపిక చేసినట్లు లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.

11/24/2017 - 23:58

హైదరాబాద్, నవంబర్ 24: టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ( టీచర్ల నియామక పరీక్ష) నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్రప్రభుత్వం పునర్విభజన చేసిన 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని స్థానికత కోసం ఒక యూనిట్‌గా తీసుకుని నోటిఫికేషనన్ విడుదల చేయడం రాష్టప్రతి ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని హైకోర్టు ప్రకటించింది.

11/24/2017 - 04:22

హైదరాబాద్, నవంబర్ 23: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహణకు ఒక పక్క భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, మరో పక్క సదస్సులో నిర్వహించే సమావేశాలు, సమాంతర సమావేశాల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సమావేశంలో మాట్లాడే వారి జాబితా సిద్ధమైంది. సమాంతర సమావేశాలు రెండు పేర్లతో నిర్వహిస్తారు. అందులో ఒకటి బ్రేకవుట్ పేరుతో రెండోది మాస్టర్ క్లాస్ పేరుతో నిర్వహిస్తారు.

11/24/2017 - 04:17

హైదరాబాద్, నవంబర్ 23: మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా భారత యువతను తయారుచేసేందుకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ముందుకు వచ్చింది. టెక్నాలజీ లెర్నింగ్ ప్లాట్‌ఫారం ఫ్లూరల్ సైట్ , విద్యాసంస్థ ఉడాసిటీతో కలిసి స్కాలర్‌షిప్‌లకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా 1.30 లక్షల మంది భారతీయ యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.

Pages