S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/17/2018 - 04:07

తిరుపతి, జనవరి 16: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేటి ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రాతః కాలారాధన పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు వెండి తిరుచ్చిలో, శ్రీ కృష్ణ స్వామివారు మరో తిరుచ్చిలో పార్వేటి మండపానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ కృష్ణస్వామివారు పార్వేటలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

01/17/2018 - 04:08

శ్రీశైలం, జనవరి 16: సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మకర సంక్రాంతిని పురస్కరించుకుని సోమవారం శ్రీశైలంలో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి అక్క మహాదేవి అలంకరణ మండలంలోకి తోడ్కొని వచ్చారు. అక్కడ వేదికపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

01/17/2018 - 04:06

భద్రాచలం టౌన్, జనవరి 16: ఉల్లాసంగా.. ఉత్సాహంగా ప్రకృతి ఒడిలో మమేకమై సేదదీరుదామని పాపికొండలకు వచ్చే పర్యాటకులకు రక్షణ కొరవడుతోంది. ప్రసిద్ధి చెందిన ఈ పర్యాటక ప్రాంతం కొందరి కనుసన్నల్లోనే సాగుతుండటంతో ఎవరి ఇష్టారాజ్యం వారిదే అన్నట్లు ఇక్కడ పెత్తనం కొనసాగుతోంది. పర్యాటకుల పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించడం ఒకఎత్తయితే.. ఏకం గా దాడులకు తెగబడటం విస్తుగొలుపుతోంది.

01/17/2018 - 01:39

ఏలూరు, జనవరి 16: ఏటికేడు కోడిపందాలను నిరోధిస్తామంటూ పోలీసులు చెప్పడం, ఆ తర్వాత న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవటం, చివరకు ఆ మూడురోజులు యధావిధిగా జూదాల జాతర జరిగిపోవటం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనవాయితీగా మారిపోయింది. ఇది చివరకు సంప్రదాయంగా కూడా పేరొందేసింది.

01/17/2018 - 01:36

హైదరాబాద్, జనవరి 16: రాజోలి బండ డైవర్షన్ పథకం (ఆర్‌డిఎస్) పూర్తి చేయడంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నీటిపారుదల మంత్రులతో ‘త్రైపాక్షిక’ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రావాలంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి ఉమామమహేశ్వర రావుకు తెలంగాణ నీటిపారుదల మంత్రి టి. హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు.

01/17/2018 - 01:35

అమరావతి, జనవరి 16: రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత కోసం నియోజవర్గాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఇటీవలి ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో ఆయనకు గట్టి హామీ లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 175 ఉన్న అసెంబ్లీ స్థానాలు 225కు పెంచాలని కోరుతూ శాసనసభ గతంలోనే తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది.

01/17/2018 - 01:30

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలిసారిగా గ్రూప్-1 వౌఖిక పరీక్షలను నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరాతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

01/16/2018 - 20:45

విజయవాడ: యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్వర్యంలో ఆదివారం 8వ సంక్రాంతి వేడుకలు తూర్పు లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన అశోక్ నుకాల జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గురించి ముందుతరాలకి అవగాహన కల్పించే కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఈసందర్భంగా ఆయన సూచించారు.

01/15/2018 - 03:43

పగటి వెలుగులు పెంచుతూ పండుగౌచు
మకర సంక్రాంతి మెండుగా మనలజేర
పగల చీకట్లు తగ్గగా భయముపోయ
హాయ హాయగ అందరూ అవధరింత్రు
*
పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లు, శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- చీఫ్ ఎడిటర్
*
సోమవారం సెలవు

01/15/2018 - 02:21

అమరావతి, జనవరి 14: సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయని, భోగిపండుగ కంటే ఉత్సాహంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Pages