S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/14/2018 - 01:54

తిరుపతి, జనవరి 13: ఈనెల 31వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు తిరుమలలో శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సాయంత్రం 5.18 గంటల నుంచి రాత్రి 8.41 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం పట్టడానికి 6గంటల ముందు నుంచే ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉదయం 11 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.

01/14/2018 - 01:54

శ్రీశైలం, జనవరి 13: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మల్లికార్జున స్వామికి భృంగి వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి హారతి ఇచ్చారు. భక్తుల జయజయధ్వనాల మధ్య స్వామివారి గ్రామోత్సవం ఆలయ మాడా వీధుల్లో కొనసాగింది.

01/14/2018 - 01:51

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 13: రైలు బోగీలోకి ఎక్కలేని వికలాంగులైన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మొట్టమొదటిసారిగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీల్‌చైర్ ద్వారా కాని మరో వ్యక్తి సాయంతో కాని రైలు ఎక్కే వికలాంగుల కోసం ఈ సౌకర్యం ఏర్పాటుచేశారు.

01/14/2018 - 01:48

హైదరాబాద్, జనవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 2018 మార్చి 11న ఒకే రోజు కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు రైతులకు ఇస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. కొత్తపాస్‌పుస్తకాల జారీ, భూసర్వే, రిజిస్ట్రేషన్ విధానంలో సంస్కరణలపై ప్రగతిభవన్‌లో శనివారం దాదాపు ఎనిమిది గంటల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.

01/14/2018 - 01:42

రేణిగుంట, జనవరి 13: రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములు అయ్యే ఐటి రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతానని, 2029 నాటికి ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రూ.350 కోట్లతో రేణిగుంట-శ్రీకాళహస్తి మార్గంలో 150 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన జోహో సాఫ్ట్‌వేర్ సంస్థ శనివారంనాడిక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు

01/13/2018 - 04:04

హైదరాబాద్, జనవరి 12: గత ఏడాది అమెరికాలో కాన్సస్‌లో జరిగిన జాతి వివక్ష దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ టెక్నోక్రాట్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్యకు అరుదైన గౌరవం లభించింది. జనవరి 30న అమెరికాలో స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ కార్యక్రమం జరగనుంది.

01/13/2018 - 04:31

ఉప్పల్, జనవరి 12: నగర శివారులోని మేడిపల్లిలోని చెంగిచర్ల చౌరస్తాలోని మెకానిక్ షెడ్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్లలో అకస్మాత్తుగా పేలుడు సంభవించి రెండు ట్యాంకర్లు, ఐదు బైక్‌లు దగ్ధం కాగా షెడ్‌తో పాటు మూడు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దారిన వెళ్లే వారిపై మంటలు పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

01/13/2018 - 02:54

హైదరాబాద్, జనవరి 12: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుంకరనేని రమేష్‌ను ఎసిబి అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడికి జి+3 ఇల్లు, రెండు జి+1 ఇళ్లు, మూడు ఓపెన్ ప్లాట్లు బంగారు, వెండి ఆభరణాలు భారీగా ఉన్నట్లు ఎసిబి అధికారులు కనుగొన్నారు. వనస్థలిపురంలో ఉన్న జి+3 ఇంటి ఖరీదే కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

01/13/2018 - 02:53

హైదరాబాద్, జనవరి 12: భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులకు జరిమాన విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక విధానంలో అనుమతుల జారీలో జాప్యం జరిగితే జరిమాన విధించే విధానాన్ని మున్సిపల్‌శాఖలో కూడా అమలు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట తారకరామారావు అధికారులను ఆదేశించారు.

01/13/2018 - 02:51

విజయవాడ (క్రైం), జనవరి 12: ఓ మల్టీనేషనల్ నేషనల్ ప్రైవేటు కంపెనీకి చెందిన ప్రతినిధుల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఉప్పు ఏడుకొండలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫైల్ క్లియరెన్స్ కోసం సదరు అధికారి పెద్ద మొత్తంలో లంచం డిమాండు చేయడంతో ఏసీబీ అధికారులు నిఘా వేసి పట్టుకున్నారు.

Pages