S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/27/2017 - 02:18

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి దసరా పండుగ నాటికే ఏడాది గడిచినప్పటికీ, ఇంకా పూర్తిస్థాయి ఉద్యోగుల నియామకం జరుగలేదు. దసరా పండుగ పర్వదినాన కొత్త జిల్లాలు లాంఛనంగా ప్రారంభం కావాల్సి ఉండటంతో పాత జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులనే సర్దుబాటు చేసారు.

12/27/2017 - 02:18

గోదావరిఖని/ మహాదేవపూర్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలోని పల్లె భూములన్నింటినీ సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కాళేశ్వరం మేడిగడ్డ’ ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా కొనసాగుతున్న బ్యారేజీ పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

12/27/2017 - 02:15

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణలో మద్యం ధరలు పెంచారు. దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్) రిటైల్ బ్రాండ్లపై పదిశాతం ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. డిసెంబర్ 31 సమీపిస్తుండడంతో మద్యం విక్రయాలు పెరిగాయి. దీంతో ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలులోకి వస్తాయి.

12/27/2017 - 04:36

హైదరాబాద్, డిసెంబర్ 26: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తన పర్యటన సందర్భంగా బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో మంగళవారం సాయంత్రం ఎట్ హోం కార్యక్రమం జరిగింది.

12/27/2017 - 02:08

అమరావతి, డిసెంబర్ 26: ఆసియాలోనే అతి పెద్దదైన 66 అడుగుల పొడవైన వీడియో తెర. దానిపై అనేక పల్లెలనుంచి సర్వీలెన్స్ కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం. మరోవైపు పరిష్కార వేదిక ద్వారా వందల సిబ్బంది ప్రజా ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరు ప్రత్యక్ష ప్రదర్శన. ఇంకోవైపు పీపుల్స్ హబ్, ఈ- ప్రగతి, తాళంవేసి ఉన్న ఇళ్లకు గస్తీ కాస్తున్న పోలీసు కెమెరా కళ్లు. వాతావరణ ప్రత్యక్ష స్థితి. ఒకటా రెండా?

12/27/2017 - 02:06

హైదరాబాద్, డిసెంబర్ 26: భూసేకరణ కేసుల్లో యాజమానులకు నష్టపరిహారం చెల్లింపులో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భూసేకరణకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరిగితే స్టే ఇవ్వాల్సి ఉంటుందని, ఈ అంశంపై మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు జడ్జి జి వెంక ట కృష్ణయ్య హైకోర్టుకు లేఖ రాశారు.

12/27/2017 - 01:59

హైదరాబాద్, డిసెంబర్ 26: తిరుమలకు చెందిన స్వచ్చందసేవా సంస్థ పరిహారసేవా సమితి సభ్యుడు భరద్వాజ చక్రవర్తిని బెదిరించిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ హైకోర్టుకు తెలిపారు. తిరుమలలో ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పరిహార సేవా సమితి పిల్ దాఖలు చేసిన విషయం విదితమే.

12/27/2017 - 00:45

విజయవాడ, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) రాష్ట్రంలోని యువతకు మరో వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే కొన్నివేల మంది నిరుద్యోగుల కు ఉపాధి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా వచ్చే మూడేళ్లలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా లక్ష మందికి నైపుణ్య శిక్షణ కల్పించడానికి సిద్ధమైంది.

12/26/2017 - 03:42

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 25: జిల్లాకేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయం సోమవారం విద్యార్థుల ఘర్షణకు వేదికగా మారింది. మనుస్మృతి దగ్ధం పేర భారతమాత చిత్రపటాన్ని కాల్చుతున్న కొంతమంది విద్యార్థులను మరోవర్గం అడ్డుకునే యత్నం చేయగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొని, రాళ్ళదాడి వరకు వెళ్ళడంతో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

12/26/2017 - 02:51

తిరుపతి, డిసెంబర్ 25: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగరాదని, వారు మోసపోకూడదని టీటీడీ యాజమాన్యం ఓవైపు నిరంతరం కృషి చేస్తుంటే, మరో వైపుసిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించి ప్రత్యేక దర్శనం నకిలీ టికెట్లను విక్రయిస్తున్నారు.

Pages