S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/28/2018 - 02:59

హైదరాబాద్, జనవరి 27: కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో నిధి నిక్షేపాల కోసం జరుగుతున్న తవ్వకాలను నిలుపుదల చేయాలనికోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ వి బ్రహ్మారెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు స్వీకరించింది. పిటిషనర్ లేఖ ద్వారా వివరాలను హైకోర్టుకు తెలిపారు. గ్రామస్తులు తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరినా, అధికారులు కొనసాగిస్తున్నారని, ఈ అంశాన్ని విచారించి స్టే ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.

01/28/2018 - 02:40

బాసర, జనవరి 27: గ్రస్థోదయ సంపూర్ణ చంద్రగహణాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న బాసర ఆలయంతోపాటు ఉపాలయాలను బుధవారం ప్రాతఃకాల పూజ అనంతరం 7.30 గంటలకు మూసివేస్తామని ఆలయ స్థానాచార్యుడు ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి గురువారం ఉదయం 4 గంటలకు అమ్మవారి ఆలయంతోపాటు ఉపాలయాల్లో సంప్రోక్షణ చేసి నిత్యాభిషేకం, మహాహారతి పూజలు నిర్వహించి భక్తులకు దర్శన సేవలను కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

01/28/2018 - 01:38

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, చేపట్టిన పథకాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి శనివారం జలసౌధలవో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో 19 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

01/28/2018 - 01:36

హైదరాబాద్, జనవరి 27: ప్రజలకు చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందంజలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం జనహిత అనే కొత్త ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమలు చేయనుంది. సాంకేతిక పరిజ్ఞానంతో జనహితను ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లా కలెక్టరేట్లకు ప్రతి సోమవారం కలిసేందుకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. తమసమస్యలను విన్నవించుకుంటారు.

01/28/2018 - 01:34

విశాఖపట్నం, జనవరి 27: జాతీయ వైద్యవిద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నట్టు ప్రభుత్వ వైద్య విద్యా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, నీట్ పరీక్షల ప్రధాన అధికారి బీ శ్రీనివాస్ వెల్లడించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

01/28/2018 - 01:33

అనంతపురం, జనవరి 27: ‘మీరు ఎవరి పక్షం అని చాలామంది అడుగుతున్నారు. అసలు రాజకీయాల్లో ఉంటారా? పారిపోతారా? అని కూడా అంటున్నారు. నేను ఏ పక్షమూ కాదు. నాది ప్రజాపక్షం. ఆఖరిశ్వాస ఉన్నంత వరకూ మీకు అండగా ఉంటాను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో మూడు రోజుల రాజకీయ యాత్రకు శనివారం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు.

01/28/2018 - 01:31

విజయవాడ, జనవరి 27: టెక్నాలజీ, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)లో ముందున్న ఏపీలో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఇన్నోవేషన్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకు సీఐఐ (కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) సహకరిస్తుందన్నారు. దావోస్ పర్యటనపై శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. తన పర్యటనలో రెండు ఎంఓయులు కుదుర్చుకున్నామని, 25 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నామన్నారు.

01/28/2018 - 01:24

అమరావతి, జనవరి 27: బీజేపీతో పొత్తుపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ పొత్తు వద్దంటే నమస్కారం పెట్టి మాట్లాడుకుందాం. అది వాళ్లు, వాళ్ల లీడర్‌షిప్పే ఆలోచించుకోవాలి. నేను మిత్రధర్మం పాటిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మీ మిత్రపక్షమైన బీజేపీనే మిమ్మల్ని అటాక్ చేస్తుంది కదా? అన్న ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. తాను మిత్రధర్మం పాటిస్తున్నానన్నారు.

01/28/2018 - 01:23

పినపాక, జనవరి 27: తెలంగాణ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి మెరుపుదాడికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో శుక్రవారం అర్ధరాత్రి విరుచుకుపడ్డారు. జానంపేట పంచాయతి గోదావరి పరీవాహక ప్రాంతం భూపతిరావుపేటలోకి ప్రవేశించిన మావోలు తొలుత గోదావరిలో ఇసుకను తరలిస్తున్న ఎనిమిది వాహనాలపై దాడి చేసి దగ్ధం చేశారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఆదివాసీ గిరిజన యువకుడిని కత్తులతో నరికి చంపారు.

01/28/2018 - 00:26

విజయవాడ, జనవరి 27: ఎంతో కీలకమైన వైద్యరంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో దేశంలో పేద, మధ్యతరగతి వర్గాలు సరైన వైద్యంకోసం తమ తాహతుకు మించి ఖర్చు చేసి అప్పులపాలై వీధిన పడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో పలువురు వైద్య ప్రముఖులతో సమావేశమయ్యారు.

Pages