S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/28/2018 - 00:22

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో జరిగే మేడారం జాతరకు 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ మధ్య 8, కాజీపేట-సిర్పూర్,-కాగజ్‌నగర్ మధ్య 2, సిర్పూర్ కాగజ్‌నగర్-ఖమ్మం-సిర్పూర్,కాగజ్‌నగర్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది.

01/28/2018 - 00:22

అమరావతి/నరసరావుపేట, జనవరి 27: కోటప్పకొండపై అన్యమత చిహ్నాల అధికారులు కూల్చివేశారు. శైవక్షేత్రమైన గుంటూరు జిల్లా కోటప్పకొండ పైన ఉన్న పార్కులో నిర్మించిన శివుడి విగ్రహానికి అటు, ఇటు క్రైస్తవ-ముస్లిం చిహ్నాలు ఏర్పాటుచేసిన వైనంపై హిందు ధర్మసంస్థలు, పీఠాథిపతులు విరుచుకుపడిన విషయం తెలిసిందే.

01/28/2018 - 00:21

ధర్మపురి, జనవరి 27: అన్ని అవతారాలకు భిన్నమైనది నరసింహావతారమని, గొప్పనైన నరసింహ రూపం విష్ణు తత్వానికి యదార్థ స్వరూపమని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. శనివారం ధర్మపురి దేవస్థానంలో శేషప్ప కళావేదికపై నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రచనంలో, విష్ణుతత్వం సర్వవ్యాపితమని, వ్యాపక నారాయణా స్థితం అన్న దానినే నరసింహావతార రూపంలో విష్ణువు చూపారన్నారు.

01/28/2018 - 00:20

హైదరాబాద్, జనవరి 27: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూరు గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ లైన్‌మేన్ బి.వెంకటేశ్ 3 వేల రూపాయలు లంచం తీసుకుంటూ శనివారం నాడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. కుంట్లూరులో ఎ.రాము అనే కాంట్రాక్టర్ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించేందుకు వెంకటేశ్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో రాము ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

01/28/2018 - 00:19

ఎ కొండూరు, జనవరి 27: ఆక్రమంగా తరలిస్తున్న గోవుల లారీలను గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని గోవులను పోలీసులకు అప్పగించిన సంఘటన ఇది.

01/27/2018 - 03:45

గోవిందరావుపేట, జనవరి 26: మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోటిమందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, జాతర సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే భయంతో ముందస్తు మొక్కులకే భక్తులు మొగ్గుచూపుతున్నారు.

01/27/2018 - 03:37

విజయవాడ, జనవరి 26: ఎంతో పవిత్రమైన హిందువుల ఆరాధ్యదైవం అయిన కోటప్పకొండలోని శివుని విగ్రహానికి అటు ఇటు క్రైస్తవ, ముస్లింల చిహ్నాలను ఏర్పాటుచేయడం మహాపచారం.. తక్షణం వాటిని తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా డిమాండ్ చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం నగరానికి చేరుకున్న తొగాడియా కానూరులో వెలగపూడి సాంబశివరావు నివాస గృహంలో రాత్రి బస చేశారు.

01/27/2018 - 03:36

హైదరాబాద్, జనవరి 26: టాలీవుడ్ హీరో నాని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వస్తుండగా కారు అదుపు తప్పి పక్కన ఉన్న డివైడర్‌ను, మధ్యలో ఉన్న విద్యుత్ స్ధంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో కారు బెలూన్లు వెంటనే తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న నానికి స్వల్ప గాయం కాగా, డ్రైవర్‌కు ఏమీ కాలేదు.

01/27/2018 - 03:33

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణలో వివిధ పాల ఏజన్సీలు పాలను కల్తీ చేసి విక్రయిస్తున్నాయంటూ నల్లగొండకు చెందిన కె నర్సింహారావు అనే వ్యక్తిరాసిన లేఖను పిల్‌గా తీసుకుని విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ పపాలలో ఎకోలి, సల్మానెల్లా అనే రసాయనాలు ఉంటున్నాయని, దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నరసింహారావు లేఖలో పేర్కొన్నారు.

01/27/2018 - 02:49

చిత్రం..హైకోర్టు ఆవరణలో శుక్రవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి

Pages