S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/27/2018 - 04:07

హైదరాబాద్, జనవరి 26: కనుల విందుగా, రంగురంగుల విద్యుద్దీపాలంకరణ మధ్య మహాహారతి కార్యక్రమం దేదీప్యమానంగా జరిగింది. భరతమాత ఫౌండేషన్ ఆధ్వ్యరంలో నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో మహాహారతి కార్యక్రమం కొనసాగింది.

01/27/2018 - 01:58

హైదరాబాద్, జనవరి 26: టి.కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్‌లో శుక్రవారం అనూహ్యంగా నాయకుల మధ్య వాగ్యుద్ధం తలెత్తింది. టి.పిసిసి ప్రధాన కార్యదర్శి టి. నిరంజన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ళ శారద మధ్య తీవ్రస్థాయలో మాటామాటా జరిగినట్లు సమాచారం. రిపబ్లిక్-డే సందర్భంగా టి.పిసిసి చీఫ్ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు.

01/27/2018 - 01:56

వరంగల్, జనవరి 26: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో దండిగా డబ్బు సంపాదించుకోవాలని ఆశలు పెట్టుకున్న బెల్లం వ్యాపారుల ఆశలు అడియాశలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ అమలు చేస్తున్న నిషేధాన్ని అవకాశంగా తీసుకుని అడ్డగోలు ధరలతో బెల్లం అమ్ముకోవచ్చనుకున్న వ్యాపారులు భారీగా బెల్లం స్టాకు చేశారు. అయతే, ఎక్సైజ్‌శాఖ తాజా నిర్ణయంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు.

01/27/2018 - 01:52

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ విద్యుత్ రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తాయ ని, రూ.37,938 కోట్లతో భారీ ఎత్తున విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. మణుగూరు, కొత్త గూడెంలో 5880 మెగావా ట్లు, దామరచర్లలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు చెప్పారు.

01/27/2018 - 01:50

హైదరాబాద్, జనవరి 26: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కె తారకరామారావుకు అరుదైన గౌరవం లభించింది. ఈ వేదికపై వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రులు మాత్రమే ప్రసంగించే అవకాశం ఉనన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున వెళ్లిన మంత్రి కేటీఆర్‌కూ ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. ఈ సదస్సులో డిజిటల్ తెలంగాణపై కేటీఆర్ ప్రసంగించారు.

01/27/2018 - 01:48

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మాడల్‌గా మారిందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. రాష్ట్ర ప్రజల అంచనాలకు అనుగుణంగా అభివృద్ధి పథనా బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగిపోతుందన్న పూర్తి విశ్వాసం తనకుందని న్నారు. విద్యుత్ ఉత్పాదనలో అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు.

01/27/2018 - 01:33

రాజమహేంద్రవరం, జనవరి 26: దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని తాను భావిస్తున్నానని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మత విశ్వాసాల పరిరక్షణ, ఆధ్యాత్మిక సంస్థల సంరక్షణ, హిందూత్వాన్ని కాపాడటం తదితర అంశాల్లో రాజ్యాంగపరమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని భావిస్తున్నానన్నారు.

01/27/2018 - 01:31

నల్లజర్ల, జనవరి 26: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాంగ్ రూటులో వచ్చిన లారీ బస్సు మధ్య భాగం నుండి చీల్చుకుంటూ దూసుకువెళ్లడంతో ఆ భాగంలో బస్సు తీవ్రంగా ధ్వంసమయ్యింది. దీనితో ఆ సీట్లలో కూర్చున్న వారంతా మృత్యువాతపడ్డారు.

01/27/2018 - 01:28

అమరావతి, జనవరి 26: మార్చి మొదటివారం నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు పూర్తవుతున్నాయన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియాకు గుర్తింపు లభించిందన్నారు.

01/27/2018 - 01:28

అమరావతి, జనవరి 26: తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ బాటలో అడుగులు వేస్తోందని, ఆయన ఆశయాల అమలుకు అహరహం కృషి చేసే పార్టీ తెలుగుదేశమేనని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన దళిత తేజం- తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Pages