S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/27/2018 - 01:26

అమరావతి, జనవరి 26: ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన జరగదన్న ధీమా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలో కనిపిస్తోంది. ఆ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ సహచరులతో ఢిల్లీ నుంచి తనకు వచ్చిన సమాచారాన్ని పంచుకుంటున్నారు. గత కొద్దిరోజుల నుంచి పాదయాత్రలో తనను కలిసేందుకు వస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతలతో జగన్..

01/27/2018 - 01:23

విజయవాడ, జనవరి 26: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా శ్రేయస్సుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకెళుతోందని, భవిష్యత్ లోనూ ఈ ఒరవడి కొనసాగిస్తుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో నిర్వహించిన 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

01/27/2018 - 01:02

హైదరాబాద్, జనవరి 26: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించరాదని, అంతవరకు వైకాపా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతుందని వైకాపా సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో వైకాపా కార్యాలయంలో రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జెండాను ఎగురవేశారు.

01/26/2018 - 04:01

హైదరాబాద్, జనవరి 25: హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్ అండ్ టీ ఎండీగా ఎస్సార్ పవర్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ కేవీబీ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ ఎండీగా వ్యవహారిస్తున్న శివానంద్ నంబూర్గి స్థానంలో ఆయన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

01/26/2018 - 03:58

హైదరాబాద్, జనవరి 25: రానున్న వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-విజయవాడ, కాచిగూడ-కాకినాడ పోర్టు మధ్య 70 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-విజయవాడ మధ్య సూపర్‌ఫాస్ట్ రైలు నెం.07757 మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపింది.

01/26/2018 - 03:13

హైదరాబాద్, జనవరి 25: ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు వేసిన వారికే పాలకులను ప్రశ్నించే హక్కు వస్తోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తొలుత కార్యక్రమానికి హాజరైన వారందరి చే ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు.

01/26/2018 - 02:14

హైదరాబాద్, జనవరి 25: మార్చి 11న రాష్టవ్య్రాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయడానికి అనుగుణంగా మార్చి 5 వరకే జిల్లాలకు పాసు పుస్తకాలు చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

01/26/2018 - 02:32

నల్లగొండ, జనవరి 25: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ బుధవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. సిఎల్పీ ఉపనేత, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హతుడు శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు కావడంతో రాజకీయ కక్షలే హత్యకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్య లు చేపట్టారు.

01/26/2018 - 02:06

అమరావతి/నరసరావుపేట, జనవరి 25: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో జరిగిన అపచారంపై శివభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపైన ఉన్న శివుడి విగ్రహానికి ఒకవైపు క్రైస్తవులు ఆరాధించే ఏసుక్రీస్తు శిలువ, మరోవైపు ముస్లింలు ఆరాధించే చంద్రవంక ఏర్పాటుచేయడం వివాదాస్పదమయింది. ఈ విషయం గురువారం ఉదయం టీవీ చాన ల్స్ ద్వారా వెలుగుచూడటం రాష్టవ్య్రాప్తంగా చర్చనీయాంశమయింది.

01/26/2018 - 02:04

విశాఖపట్నం, జనవరి 25: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నవ్యాంధ్రకు కొత్త రైల్వే జోన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఇప్పటి వరకూ ఆ దిశగా తీసుకున్న చర్యల్లేవు. జోన్ ఏర్పాటుపై నియమించిన కమిటీ నివేదిక ఇచ్చి తమపని పూర్తయిందనిపించింది.

Pages