S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/11/2018 - 03:13

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణలో ధర్నాలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్న టీఆర్‌ఎస్ ఢిల్లీలో మాత్రం ధర్నాలు చేస్తుందని, లోక్‌సభ కార్యక్రమాలను అడ్డుకుని తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

03/11/2018 - 03:13

హైదరాబాద్, మార్చి 10: రాష్ట్రంలోని రైతులందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముంబయి నుండి వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసి) ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా ఇక్కడ సమావేశమయ్యారు.

03/11/2018 - 03:11

హైదరాబాద్, మార్చి 10: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు బలం లేనందున ఖాళీలేర్పడనున్న మూడు స్థానాలూ ఏకగ్రీవం అవుతాయనీ, ఆ మూడూ టిఆర్‌ఎస్ ఖాతాలోకే వెళతాయని అందరూ భావించారు. కానీ శుక్రవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

03/11/2018 - 03:09

హైదరాబాద్, మార్చి 10: ఇంటర్మీడియట్ పరీక్షల్లో పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో స్క్వాడ్ వెళ్లిందంటే చాలు విద్యార్థులు అక్కడ పట్టుబడుతున్నారు. చాలా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల సహకారంతోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

03/11/2018 - 03:07

హైదరాబాద్, మార్చి 10: రిజర్వేషన్ల విషయంలో తప్పుడు సమాచారంతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం వంచిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం కావాలని అంటున్నారని, మాట తప్పడం, ఇచ్చిన మాట అమలుచేయకపోవడమే తెలంగాణ మోడలా?

03/11/2018 - 00:24

కరీంనగర్, మార్చి 10: హిందూ సమాజాన్ని ఐక్యం చేసే లక్ష్యంగా ఆదివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పూలే (సర్కస్) మైదానంలో తలపెట్టిన ‘హిందూ శంఖారావం’ సదస్సుకు అంతా సిద్ధమైంది.

03/11/2018 - 00:23

ఆదిలాబాద్, మార్చి 10: వేసవి ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో దాహార్తి కోసం పెద్దపులులు, చిరుత పులులు సంచరిస్తూ అటవీ శాఖ సిసి ఫుటేజీల్లో కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, కవ్వాల్ అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనాకు వస్తున్నారు.

03/11/2018 - 00:20

పెద్దపల్లి రూరల్, మార్చి 10: పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామంలో సోలార్ సంస్థ ఎక్స్‌ప్లోజర్స్ (పేలుడు పదార్థాల తయారీ) పరిశ్రమ ఏర్పాటు మళ్లీ తెరపైకి వచ్చింది. రాగినేడు గ్రామ సమీపంలో సోలార్ సంస్థ కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను వ్యవసాయ శాఖ పెద్దపల్లి డివిజన్ ఎడిఎ జాకీర్ అలీ, ఎవో ప్రకాశ్‌తో కలసి శనివారం పరిశీలించారు.

03/11/2018 - 00:20

మహబూబ్‌నగర్, మార్చి 10: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాజ్యహింస కొనసాగుతోందని గతంలో ఎన్నో సందర్భాలలో రాజ్యహింసకు గురయ్యారని ప్రసంగాల్లో విన్నామని అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక్షంగా రాజ్యహింసను కళ్లారా చూస్తున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు.

03/11/2018 - 00:16

హైదరాబాద్, మార్చి 10: పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆదివారం రోజు రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

Pages