S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/06/2018 - 04:16

హైదరాబాద్, మార్చి 5: ఉస్మాన్ సాగర్‌తో పాటు పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. గండిపేటను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రూ. 100 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. గండిపేట లేక్ డవలప్‌మెంట్ టాస్క్ఫోర్స్ ద్వారా అభివృద్థి పనులను కొనసాగించనున్నారు.

03/06/2018 - 04:15

హైదరాబాద్, మార్చి 5: గత నెల 24 నుంచి 28 వరకు ఐదురోజుల పాటు చెన్నైలో జరిగిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని విజేతలైన తెలంగాణ పోలీసు సిబ్బంది డిజిపి ఎం.మహేందర్‌రెడ్డిని కలిశారు. డిజిపి కార్యాలయంలో సోమవారం తాము సాధించిన మెడల్స్, ట్రోపిలను డిజిపికి చూపించారు. ఇదే స్పూర్తితో పని చేసి మరిన్ని అవార్డులు, ట్రోపీలు సాధించాలని డిజిపి వారిని అభినందించారు.

03/06/2018 - 04:14

హైదరాబాద్, మార్చి 5: రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం (ఆర్‌ఇఆర్‌ఎ) లో మార్పులు చేర్పులు చేసేందుకు ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు. పురపాలక వ్యవహారాల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్‌ఎంసి చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి, డైరెక్టర్ ప్లానింగ్ ఎస్. బాలకృష్ణ, డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కె.

03/06/2018 - 04:13

హైదరాబాద్, మార్చి 5: ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పశు, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఆక్వా ఎక్స్‌పో-2018 ఏర్పాట్లపై సోమవారం ఆయన సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

03/05/2018 - 04:28

నల్లగొండ, మార్చి 4: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక భూమికకు తహతహలాడుతున్న టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బహుళ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ నల్లగొండ లోక్‌సభ సీటుపై కనే్నసినట్టుగా సాగుతున్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

03/05/2018 - 03:39

హైదరాబాద్, మార్చి 4: దేశ వ్యాప్తంగా బిజెపికి లభిస్తున్న ఆదరణ చూసి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు వణుకు పుడుతున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుని, అదే బలం అనుకుంటున్నారని ఆయన విమర్శించారు.

03/05/2018 - 03:35

హైదరాబాద్, మార్చి 4: రాష్ట్రంలో ప్రతీ ఏటా నూతనంగా రెండు వేల మంది క్యాన్సర్ భారిన పడుతుండగా, దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో ప్రతీ ఎనిమిది నిమిషాలకో మహిళ మృతి చెందుతున్నట్టు క్యాన్సర్ వ్యాధిపై జరుగుతున్న సర్వేలు పేర్కొనడం ఆందోళన కలిస్తుంది. నివారించదగ్గ క్యాన్సర్‌లపై ప్రజల్లో కొరవడిన అవగాహన ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.

03/05/2018 - 01:00

హైదరాబాద్, మార్చి 4: రైతుల ఆదాయం ఏడాది లేదా రెండేళ్లలోగా రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేయాలని కేంద్రం రూపొందించిన ప్రణాళికను మూడేళ్ల ముందే చేరాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

03/05/2018 - 00:59

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పార్టీ (టీపీపీ) పేరుతో నూతన పార్టీ ఆవిర్భవించింది. ఆదివారం పార్టీ ఆవిర్భావ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. పార్టీని ప్రకటించిన అనంతరం ఆకుపచ్చ, తెలుపు, నేవీబ్లూ రంగులతో కూడిన త్రివర్ణ జెండాను చంద్రకుమార్ ఆవిష్కరించారు.

03/05/2018 - 00:59

హైదరాబాద్, మార్చి 4: ప్రభుత్వం తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలను అప్పగించడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్ పేర్కొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి, అధ్యక్షులు గౌతమ్ మాట్లాడారు.

Pages