S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/31/2018 - 02:40

హైదరాబాద్, జనవరి 30: అడవులు నరికినా, వన్య ప్రాణులను సంహరించినా మరింతగా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. వారం రోజుల పాటు జరిగిన పులుల జంతు గణనలో పాల్గొన్న వాలంటీర్లతో అటవీ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం అరణ్య భవన్‌లో సమావేశమై సమీక్షించారు.

01/31/2018 - 02:39

జహీరాబాద్, జనవరి 30: ముస్లిం పర్సనల్ లాబోర్డుతోనే మహిళలకు పూర్తి రక్షణ ఉందని ఎంఐఎం. అధ్యక్షుడు, ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ అన్నారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు, ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాగారెడ్డి స్టేడియంలో సోమవారం రాత్రి ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగసభకు ఎంపీ అసదుద్ధీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం సమాజానికి ముప్పు ఉందని హెచ్చరించారు.

01/31/2018 - 02:37

హైదరాబాద్, జనవరి 30: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలకు అవసరమైన నిధులు వచ్చే బడ్జెట్‌లో కేటాయించడానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. బడ్జెట్‌లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్, పట్టాణాభివృద్ధిశాఖలకు కేటాయించే నిధుల ప్రతిపాదనలపై మంగళవారం సంబంధిత అధికారులతో మంత్రి చర్చించారు.

01/31/2018 - 02:35

హైదరాబాద్/నార్సింగి, జనవరి 30: జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రులు, నాయకులు ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. లంగర్‌హౌస్ బాపూఘాట్‌లో మంగళవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్మారక భవనంలో కూడా జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సామూహికంగా రాఘపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం...అంటు గీతాలాపన గావించారు.

01/31/2018 - 02:33

హైదరాబాద్, జనవరి 30: వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి టిఆర్‌ఎస్‌యే అధికారంలోకి రావడం ఖాయమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్ ఒక్కటే 100 సీట్లు గెలుచుకుంటుందని వివిధ సర్వేల్లో వెల్లడైందన్నారు. అన్ని పార్టీలు ఏకమైనా ‘వార్ వన్ సైడ్’గా ఉంటుందన్నారు.

01/30/2018 - 03:59

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు.

01/30/2018 - 03:59

హైదరాబాద్, జనవరి 29: దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)కు హాజరైనందుకు వేల కోట్లాది రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెబుతున్నదంతా అబద్ధం అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ సర్పంచ్, టిఆర్‌ఎస్ నాయకులు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.

01/30/2018 - 03:58

హైదరాబాద్/నేరేడ్‌మెట్, జనవరి 29: ప్రొఫెసర్ కంచ ఐలయ్య సోమవారం మల్కాజిగిరి కోర్టుకు హజరైయ్యారు. గతంలో రాసిన పుస్తకంలో తమను కించపరిచారని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఐలయ్య హాజరైయ్యాడు. కేసును వచ్చే నెల 19కి వాయిదా వేశారని పోలీసులు తెలిపారు.

01/30/2018 - 03:57

హైదరాబాద్, జనవరి 29: పంటల బీమాకు 2018 ఖరీఫ్‌లో ఆరు క్లస్టర్లు ఉంటాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. పంటల బీమాపై రాష్టస్థ్రాయి సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది. 2018 ఖరీఫ్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సవరించిన వాతావరణ పంటల బీమాలను కలిపి ఉమ్మడిగా నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

01/30/2018 - 03:57

హైదరాబాద్, జనవరి 29: గిరిజనుల సమస్యలపై అధ్యయనం చేయడం కోసం ఏర్పాటైన కమిషన్ ఆఫ్ ఇంక్వ్యరీ గడువును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా పేరుతో ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 4) జారీ అయ్యాయి. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎస్. చెల్లప్ప చైర్మన్‌గా, ఐపిఎస్ (రిటైర్డ్) అధికారి కె.

Pages