S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/13/2016 - 02:50

ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో సంప్రదాయబద్ధంగా సాగుతున్న ఆదివాసీల నాగోబా జాతర ఉత్సవాలు మండగాజిలి ఉత్సవాల్లో ముగిశాయి. శుక్రవారం మెస్రం వంశీయులు తమ ఆచార వ్యవహారాలతో నాగోబాకు పూర్ణాహుతి పూజలు చేసి జాతర ఉత్సవాలకు ముగింపు పలికారు. ఉదయం నుండే వివిధ ప్రాంతాల నుండి భక్తిపారవశ్యంతో తరలివచ్చిన గిరిజనం తమ ఇలవేల్పు అయిన నాగోబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

02/13/2016 - 02:49

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 12: ఎసిబి అధికారుల వలలో ఆరోగ్య శాఖలోని ఓ అవినీతి చేప చిక్కింది. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హైమత్ బేగం ఎన్‌ఎంగా పనిచేస్తున్న శ్రీరాముల విజయ నుంచి పెద్దపల్లి ఆస్పత్రిలో ఐదు వేల లంచం తీసుకుంటుండగా శుక్రవారం మధ్యాహ్నం ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

02/13/2016 - 02:49

హైదరాబాద్, ఫిబ్రవరి 12: వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 17న సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు, వరంగల్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌లో ఉదయం 9.30కి బయలుదేరి, మధ్యాహ్నం 12.45 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.

02/13/2016 - 02:48

వరంగల్, ఫిబ్రవరి 12: మేడారం జాతర సందర్భంగా మేడారంలో 50 ఎకరాల్లో ఆర్టీసి తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వరంగల్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుండి మేడారంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

02/13/2016 - 02:48

మంగపేట, ఫిబ్రవరి 12: వన దేవతలైన మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెల వద్ద ముందస్తు మొక్కులు కొనసాగుతున్నాయి. సారలమ్మ గద్దెపై కొలువుదీరే ఫిబ్రవరి 17 నుండి వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేసే 20వ తేదీ వరకు జరగనున్న మేడారం మహా జాతరకు ఈ సంవత్సరం కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో లక్షలాది మంది జాతరకు ముందే ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

02/13/2016 - 02:47

హైదరాబాద్, ఫిబ్రవరి 12: వయోజన విద్య లక్ష్యాలను అధిగమించే దిశగా ప్రయత్నించాలని నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ (ఎన్‌ఎల్‌ఎంఏ) డిజి వైఎస్‌కె శేషుకుమార్ ఆ శాఖ సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలోని గోదావరి హాల్లో జరిగిన రెండు రాష్ట్రాల వయోజన విద్యా కార్యక్రమాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు.

02/13/2016 - 02:46

హైదరాబాద్, ఫిబ్రవరి 12: స్వరాష్ట్రంలో ఉమ్మడి రాజధానిలో కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లు శుక్రవారం కొలువుదీరారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం పనె్నండు గంటల నలభై నిమిషాలకు మేయర్ బొంతు రామ్మోహన్ తన ఛాంబర్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టగా, అంతకు ముందు పదకొండున్నర గంటలకు సమయంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ బాధ్యతలు స్వీకరించారు.

02/12/2016 - 17:07

ముంబై:ఐసిసి అంపైర్ ప్యానల్ సభ్యుడు, పాకిస్తాన్‌కు చెందిన అంపైర్ అసద్ రవూఫ్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి సంబంధం ఉన్న ఏ మ్యాచ్‌లోనూ ఆయన అంపైరింగ్ చేయడానికి అనుమతించరు. ఐపిఎల్-2013లో బుకీలనుంచి ఖరీదైన బహుమతులు అందుకుని అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై నియమించిన విచారణ కమిటీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో బీసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

02/12/2016 - 16:30

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. నగర మేయర్‌గా ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యమంలో ఏవిధంగా పనిచేశామో జీహెచ్‌ఎంసీ అభివృద్ధి కోసం అదేవిధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

02/12/2016 - 16:28

మెదక్‌ : నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో రేపు ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గంలో 200 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఇంకుగుర్తు పెట్టే విషయంలో ఎన్నికల సంఘం స్వల్పమార్పు చేసింది. ఓటరు కుడిచేయి చూపుడు వేలుకు ఇంకుగుర్తు పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేసింది.

Pages