S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/26/2018 - 03:56

హైదరాబాద్, జనవరి 25: దేశవ్యాప్తంగా ఐఐటిల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో వారి కోసం అదనంగా సూపర్‌న్యూమరీ సీట్లను పెంచాలని ఐఐటి కౌన్సిల్ నిర్ణయించింది. గత ఏడాది జరిగిన అడ్మిషన్ల గణాంకాలు చూస్తే మొత్తం సీట్లలో అమ్మాయిలు 8 శాతం మాత్రమే ఉన్నారు. కొన్ని రిజర్వుడ్ కేటగిరిల్లో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉంది. మిగిలిన చోట క్వాలిఫై అయిన అమ్మాయిలు ఎక్కువగానే ఉన్నారు.

01/26/2018 - 03:56

హైదరాబాద్, జనవరి 25: ఉపాధికి పరిమితం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని దళిత యువతకు విద్యుత్, ఎస్సీ సంక్షేమ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హితవు పలికారు. పూర్వకాలంలో వృత్తి విద్యా కోర్సులు వారసత్వంగా సంక్రమించేవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ పర్యాటక ఆతిథ్య సంస్థలో దళిత యువతకు ఉపాధి రంగంలో శిక్షణ కోర్సులను మంత్రి జగదీష్‌రెడ్డి ప్రారంభించారు.

01/26/2018 - 03:55

హైదరాబాద్, జనవరి 25: రైతుల హక్కులు, వ్యవసాయ జీవ వైవిద్యంపై ఈ నెల 27 న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రాంతీయ సదస్సు, ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఈ వర్సిటీ పరిశోధనా సంచాలకులు డాక్టర్ టీ. ప్రదీప్ తెలిపారు. దక్షిణ భారత్‌కు చెందిన ఐదు రాష్ట్రాల నుండి 400 మంది రైతు ప్రతినిధులు పాల్గొంటారని గురువారం ఒక ప్రకటనలో వివరించారు.

01/26/2018 - 03:55

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్తోను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.హైదరాబాద్ (రాజేంద్రనగర్) లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో కేంద్ర మంత్రితో జూపల్లి గురువారం భేటీ అయ్యారు. జిల్లాపరిషత్‌లు, మండల పరిషత్‌లకు కూడా గ్రామపంచాయితీలకు ఇస్తున్న విధంగానే ఆర్థిక సాయం చేయాలని సూచించారు.

01/26/2018 - 03:53

హైదరాబాద్, జనవరి 25: భారత రాజ్యాంగం, సాహిత్యం అంశాలపై సైనే్సషన్ సొసైటీ సాంఘిక సంభాషణ కార్యక్రమాన్ని 26,27 తేదీల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసింది. 26న రాజ్యాంగంపై జరిగే సాంఘిక సంభాషణలో డాక్టర్ జయశ్రీ సుబ్రమణియన్, డాక్టర్ లావణ్య సురేష్, ఎల్ రవిచందర్, కల్పన రమేష్ జ్యూరీ సభ్యులుగా పాల్గొంటారు.

01/26/2018 - 03:53

హైదరాబాద్, జనవరి 25: రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన కొలంబియా యూనివర్శిటీ ప్రొఫెసర్ మార్టిన్ చాల్ఫీ శనివారం నాడు హైదరాబాద్ వస్తున్నారు. 2015, 2016 సంవత్సరాలకు గానూ బి ఎం బిర్లా సైన్స్ ప్రైజెస్‌ను ఆయన అందిస్తారు. ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఎ ఎస్ కిరణ్‌కుమార్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ డి బాలసుబ్రమణియన్ కూడా హాజరవుతారు.

01/26/2018 - 03:53

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 25: ఆదివాసి వీర వనితలు సమ్మక్క, సారలమ్మలపై ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సంపాదకీయంలో రచించిన పరిశోధనాత్మక గ్రంథం ‘వీరుల పోరుగద్దె మేడారం’ పుస్తకావిష్కరణ సభ గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది.

01/26/2018 - 03:51

వరంగల్, జనవరి 25: కేంద్రప్రభుత్వం రూపొందించిన రైట్ టు ఎడ్యుకేషన్ నిబంధనలను అమలుచేసే ఆలోచన రాష్ట్రప్రభుత్వానికి లేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ నిబంధనల అమలువల్ల ఇంజనీరింగ్ కళాశాలల మాదిరిగా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చి మరో ఫీజు రీయంబర్స్‌మెంట్ స్కాంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

01/26/2018 - 03:46

నార్కట్‌పల్లి, జనవరి 25: పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవానికి చెర్వుగట్టు భక్త జనసముద్రంగా మారింది. సాక్షాత్తూ పరమేశ్వరుడే వరుడిగా, పార్వతీదేవి వధువుగా చెర్వుగట్టు కల్యాణానికి సిద్ధం కావడంతో చెర్వుగట్టు హరినామస్మరణతో మార్మోగిపోయింది. శైవ ఆగమశాస్త్రం ప్రకా రం గురువారం తెల్లవారుజామున సూర్యుడు ఉదయించిన తొలి కిరణాల సమయంలో పరమేశ్వరుడి కల్యాణాన్ని నయనానందకరంగా, కన్నులపండువగా నిర్వహించారు.

01/26/2018 - 03:43

సూర్యాపేట, జనవరి 25: రాష్ట్రంలో రైతాంగం ఏదుర్కొంటున్న సమస్యలపై టీజేఎసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం వెల్లడించారు. జిల్లాకేంద్రంలో టీజేఎసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతాంగ సమస్యలు - ఉద్యమ కార్యాచరణ సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

Pages