S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/24/2018 - 03:13

హైదరాబాద్, జనవరి 23: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కోర్టులో తప్పుడు కేసులు వేస్తున్నారని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి మర్రి విషపూరితమైన ప్రచారంతో లబ్ధిదారులను అయోమయానికి గురిచేయడమే కాకుండా పనులను అడ్డుకునేందుకు కోర్టులో తప్పుడు కేసులు వేశారని ఆయన ఆరోపించారు.

01/23/2018 - 04:16

బాసర, జనవరి 22: బాసర క్షేత్రం సోమవారం వసంతశోభను సంతరించుకుంది. మాఘశుద్ధ పంచమిని వసంతపంచమిగా వేడుకగా నిర్వహిస్తారు. జ్ఞానానికి ఆదిదేవత సరస్వతీదేవి జ్ఞానిస్వరూపిణిగా పిలుస్తారు.

01/23/2018 - 04:13

కరీంనగర్, జనవరి 22: రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఎస్సారెస్పీ నుంచి విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నామని, అయితే, కాలువలలో మోటార్లు బిగించడం వల్ల చివరి ఆయకట్టు భూములకు నీళ్లు అందే పరిస్థితి లేకుండా పోయిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

01/23/2018 - 04:09

మల్యాల, జనవరి 22: రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం వచ్చే సంవత్సరం నుండి ఇంటర్‌మీడియట్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆయన సోమవారం మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గురుకులంలోని డార్మెటరీ హాల్, మూత్రశాలలు, హస్టల్ గదులను తిరిగి పరిశీలించారు.

01/23/2018 - 04:06

మంచిర్యాల, జనవరి 22 : మంచిర్యాల జిల్లా నెనె్నల మండల కేంద్రానికి చెందిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రంగు రామాగౌడ్ (42) సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

01/23/2018 - 04:06

నాగర్‌కర్నూల్, జనవరి 22: నియోజకవర్గంలోని ముంపురైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్‌కు రైతులతో కలిసి వచ్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని లోపలికి వెళ్లకుండా ప్రధాన గేట్‌వద్దనే పోలీసులు అడ్డుకొని గేట్ వేయడంతో పోలీసుల తీరును నిరసిస్తూ రైతులతో కలిసి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు.

01/23/2018 - 03:58

హైదరాబాద్, జనవరి 22: సర్పంచ్ ఎన్నికల విధానాన్ని మార్చరాదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో పలువురు నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

01/23/2018 - 03:57

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణలోని నేషనల్ హైవేస్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి పథకం (ఎన్‌హెచ్‌డీపీ) కింద 2398 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర రహదారులు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్ అండ్ బి కార్యక్రమాలపై సోమవారం ఆయన ఇక్కడ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్రం గ్రాంటు కింద జాతీయ రహదారుల కోసం నిధులు ఇస్తోందన్నారు.

01/23/2018 - 03:38

నల్లగొండ, జనవరి 22: నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేలా తెలంగాణ పోలీస్ శాఖ ప్రయత్నిస్తుందని ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఫ్రెండ్లీ పోలీస్ విధానాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నామని డిజిపి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ఐటి సెల్‌లను ఆయన ప్రారంభించారు.

01/23/2018 - 03:38

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్‌కు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండర్ సెక్రటరీ పంకజ్ గంగ్వార్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐఏఎస్ హోదా లభించినవారిలో కొర్రాలక్ష్మి, కె. ధర్మారెడ్డి, చిట్టెం లక్ష్మి, టి. వినయ్‌కృష్ణారెడ్డి, సిహెచ్.

Pages