S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/20/2018 - 04:04

నల్లగొండ, జనవరి 19: టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు టిఆర్‌ఎస్‌లో చేరుతారా..? ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా టిడిపి శ్రేణుల్లో ఎవరిని కదిపినా ఇదే చర్చ రచ్చరచ్చ చేస్తుంది. ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ టిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లలో మోత్కుపల్లి కూడా పార్టీ వీడిపోతారన్న సందేహాలను రగిలించాయి.

01/20/2018 - 04:03

సంగారెడ్డి, జనవరి 19: పోలీసు శాఖలో నియామకాలు పూర్తయ్యాక, పోలీసులకు వారాంతపు సెలవును అమలుచేసే ప్రయత్నం చేస్తామని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి స్పష్టం చేసారు. శుక్రవారం సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మండపంలో సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

01/20/2018 - 03:43

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల అభివృద్ధి, కొత్తగా పరిశ్రమల స్థాపన, ప్రజల సంపద పెరగడంలో మీ పాత్ర ఏముందీ? అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. హైదరాబాద్ పరిసరాల్లోని మూడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటీ?, మీరు చేసిన అభివృద్ధి ఏమిటీ?

01/20/2018 - 03:42

హైదరాబాద్, జనవరి 19: మారుమూల గ్రామాల ప్రజలకూ మొబైల్ డెంటల్ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామని వైద్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ ఆసుపత్రిని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

01/20/2018 - 03:40

హైదరాబాద్, జనవరి 19: పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్‌గా , సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తెలంగాణ ప్రాంత అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఇ మారియప్పన్ శుక్రవారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరువనంతపురం పత్రికా కార్యాలయం అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న మారియప్పన్ బదిలీపై హైదరాబాద్ వచ్చారు. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు.

01/20/2018 - 03:37

హైదరాబాద్, జనవరి 19: ఖమ్మం జిల్లాలోని సీతారామా ఎత్తిపోతల సేజ్-1కు శుక్రవారం అటవీ అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 1531 హెక్టార్ల (3781 ఎకరాలు) అటవీ భూమి సేకరణకు కేంద్ర అటవీశాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం శుక్రవారం అనుమతి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయనున్నట్టు అటవీ, పర్యావరణ సాధికార కమిటీ ప్రకటించింది.

01/20/2018 - 03:37

హైదరాబాద్, జనవరి 19: దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

01/20/2018 - 03:36

హైదరాబాద్, జనవరి 19: తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెడతారా? అని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమారపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

01/20/2018 - 03:35

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా -8 శాతం వర్షపాతంలోటు నమోదైంది. మొత్తం 845 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, డిసెంబర్ వరకు 776 వర్షపాతం నమోదైంది.

01/20/2018 - 03:34

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రం తక్కువ కాలంలో కెసిఆర్ పారదర్శకత, దూరదృష్టి వల్ల విద్యుత్ రంగంలో మిగులు విద్యుత్‌ను సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని,కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయాన్ని ఓర్వలేక అవాకులు చవాకులు వాగితే సహించేది లేదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, సంక్షేమ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Pages