S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/19/2018 - 02:43

చౌటుప్పల్, జనవరి 18: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయా ణి కులు క్షేమంగా బయటపడ్డారు. వివరాలలోకి వెళ్తే...నర్సరావుపేటకు చెందిన కట్ట పద్మజ కుమారుడు రామచంద్రారెడ్డి, కుమార్తె వాసంతి కర్ణాటకలో మెడిసిన్ చదువుతున్నారు.

01/19/2018 - 02:41

పటాన్‌చెరు, జనవరి 18: ప్రాచీన భారతీయ గ్రంథాలలో అపారమైన జ్ఞానం నిక్షిప్తమై ఉందని డిఆర్‌డిఓ పూర్వ శాస్తవ్రేత్త డాక్టరు ప్రహ్లాద అన్నా రు. వాటిని సరైన రీతిలో అర్థం చేసుకుని అమలు పరచడంలో మనం విఫలమవుతున్నామని ఆయన ఆవేదన చెందారు. పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని గీతం విశ్వవిద్యాలయంలో గురువారం ఏరోస్పేస్ టెక్నాలజీ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేసారు.

01/19/2018 - 02:38

నాగార్జునసాగర్, జనవరి 18:సకల సంపద సృష్టికి వెనుకబడిన, అణగారిన కులాలవారే కార కులని బీసీ కమిషన్ చైర్మన్ బి.రాములు అన్నారు. నాగార్జునసాగర్‌లో గురువారం ఆచార్య కొండాలక్ష్మణ్‌బాపూజీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వెనుకబడిన కులాల లో ఎబిసిడిగా పునర్‌వర్గీకరణకు కసరత్తు చేస్తున్నామని అన్నారు.

01/19/2018 - 02:35

మిర్యాలగూడ టౌన్, జనవరి 18: 2011లో జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షలో అభ్యర్ధి బదులు మరొకరు రాసిన కేసు విచారణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మంది కానిస్టేబుళ్లు బయటపడటంతో బుధవారం రాత్రి హైద్రాబాద్ సీఐడీ పోలీసు అధికారులు అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిల్లో ఒకేసారి దాడులు నిర్వహించి 16 మందిని అరెస్టు చేశారని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

01/19/2018 - 02:47

కరీంనగర్, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పనితీరు చాలా బాగుందని బ్రిటీష్ హై కమిషనర్ అండ్రో ఫ్లెమింగ్ కితాబునిచ్చారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించడం నిజంగా అద్భుతమని పేర్కొన్నారు. గురువారం సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌లో ఆయన స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌తో కలిసి పర్యటించారు.

01/18/2018 - 03:56

హైదరాబాద్, జనవరి 17: అత్యవసర వైద్య సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న 108, 104 అంబులెన్స్ వాహనాలకు అదనంగా ‘102’ ద్విచక్ర వాహన అంబులెన్స్‌లనూ ప్రభుత్వం బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ‘102’ ద్విచక్ర వాహన వైద్య సేవలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు.

01/18/2018 - 03:49

న్యూఢిల్లీ, జనవరి 17: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘సాగుగు పెట్టుబడి సాయం పథకం’లో భాగంగా బ్యాంకుల్లో తగినంత నగదు నిల్వలను అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు.

01/18/2018 - 03:47

హైదరాబాద్, జనవరి 17: కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు కోర్ ఏరియా నుంచి రెండు గ్రామాలు తరలివెళ్లడానికి రెండు గ్రామాలు సుముఖత వ్యక్తం చేసాయి. టైగర్ ప్రాజెక్టు నుంచి తరలించే గ్రామాలకు అత్యంత మెరుగైన పునరావాసం కల్పించాల్సిందిగా అటవీశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు.

01/18/2018 - 03:45

హైదరాబాద్, జనవరి 17: వచ్చే విద్యాసంవత్సరం (2018-19) నుండి ములుగు మండలం జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్‌లోని మామునూరులో వెటర్నరీ కాలేజీని ప్రారంభించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌లో చెప్పారు. ఈ రెండింటిలో 2018 జూన్ నుండి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

01/18/2018 - 03:44

హైదరాబాద్, జనవరి 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగువేల రూపాయల ఆర్థిక సాయం పథకం రైతు సమన్వయ సమితుల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం అమల్లో బ్యాంకుల ప్రమేయం ప్రత్యక్షంగా లేకుండా చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పరోక్షంగా మాత్రం బ్యాంకుల అవసరం ఉంటుంది. రాష్ట్రం మొత్తంలో దాదాపు 10 వేల గ్రామ రైతు సమన్వయ సమితులు ఏర్పాటయ్యాయి.

Pages