S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/16/2020 - 04:36

హైదరాబాద్, మార్చి 15: రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలుకు వెంటనే రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం ఇక్కడ ఆయన పంటల గిట్టుబాటు ధరలు, రైతాంగ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు, అవగాహన లేని కారణంగానే కంది రైతులకు నష్టం కలిగిందన్నారు.

03/16/2020 - 05:38

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని, టీఆర్‌ఎస్, ఎంఐఎం విధ్వంసకాండను నిలువరిస్తామని బీజేపీ రాష్ట్ర కొత్త రథసారథి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘యుద్ధం ప్రారంభమైంది. కేసీఆర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం రెపరెపలాడుతుంది’ అని అన్నారు.

03/16/2020 - 04:27

హైదరాబాద్, మార్చి 15: ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చడం దారుణమని, అసలు కరోనా ఆయనేనని, కాంగ్రెస్ దేశానికి కన్నతల్లి లాంటిదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కరోనాతో పోల్చడం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. పారాసిట్‌మాల్ గోలీతో కరోనా

03/15/2020 - 06:09

హైదరాబాద్, మార్చి 14: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వనిదేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంజేందర్ శాసనమండలిలో స్పష్టం చేశారు. గుత్త సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన సభలో రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్ ప్రభావం), తీసుకున్న చర్యలపై లఘు చర్చ జరిగింది.

03/15/2020 - 06:07

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో కొత్తగా 1200 చెక్ డ్యామ్‌లను నిర్మించనున్నట్టు ఆర్ధిక మంత్రి హరీష్‌రావు చెప్పారు. శనివారం నాడు శాసనసభలో గండ్ర వెంకటరమణా రెడ్డి, రవి శంకర్ సుంకే, సతీష్‌కుమార్ ఓడితెల, గువ్వల బాలరాజు తదితరులు అడిగిన ప్రశ్నలకు హరీష్‌రావు సమాధానం చెబుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 146 చెక్ డ్యామ్‌లను మంజూరు చేశామని అన్నారు.

03/15/2020 - 06:05

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూలులో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ అధికారులు శనివారం రాత్రి పేర్కొన్నారు. ప్రాధమిక పాఠశాలలు, ప్రాధమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించినా పరీక్షల షెడ్యూలులో మార్పులు లేవని వారు చెప్పారు.

03/15/2020 - 06:04

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో ఇంకా సాదాబైనామాలకు రెవెన్యూ రికార్డులు అందలేదని, వీటి కోసం త్వరలో రెవెన్యూ కొత్తచట్టాలను తీసుకురావడానికి ప్రభుత్వం సమాలోచన చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

03/15/2020 - 06:03

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తున్నామని, ఈ విషయం గొర్లకాపన్లకు సుభవార్త అంటూ రాష్ట్ర పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం శాసనసభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బడ్జెట్ పద్దుల అంశంపై మాట్లాడుతూ వచ్చే జూన్‌లో రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తున్నామన్నారు.

03/15/2020 - 06:03

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా మరో 6.62 లక్షల మందికి ఆసరా పెన్షన్లను ఇవ్వనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శనివారం నాడు శాసనసభలో చల్లా ధర్మార్డె, కాలే యాదయ్య, కోరుకంటి చందర్, గుర్మ జైపాల్ యాదవ్ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ఆసరా పింఛన్లకు ప్రభుత్వం ఇంత వరకూ 27,868.99 కోట్లు నిధులు ఖర్చు చేస్తోందని అన్నారు.

03/15/2020 - 06:02

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ శాసనసభ తొమ్మిది పద్దులకు శనివారం సాయంత్రం ఆమోదం తెలిపింది. రెవెన్యూ-రిలీఫ్, ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, సహకారం, పశుసంవర్థకం, పౌరసరఫరాల పద్దులను ఆమోదించింది. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యవసాయం, సహకార రంగాల పద్దులపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ, సహకార రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Pages