S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/04/2018 - 00:02

సంగారెడ్డి, జనవరి 3: సింగూర్ ప్రాజెక్టు కింద 38 గ్రామాలకు చెందిన రైతులు 37 వేల ఎకరాల్లో యాసంగి పంటను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. రబీ సాగుకు అవసరమైన సాగునీటిని బుధవారం నాడు అందోల్ ఎమ్మెల్యే పల్లె బాబుమోహన్ సింగూర్ కాలువల ద్వారా నీటిని విడుదల చేసారు. గడచిన ఖరీఫ్‌లో కూడా ఈ కాలువల ద్వారా సుమారుగా 40 వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగుచేసి పంట దిగుబడి చేసుకున్నారు.

01/04/2018 - 00:01

సూర్యాపేట, జనవరి 3: వందేళ్ల ఘనచరిత్ర ఉందని, రాష్ట్రాన్ని, దేశా న్ని ఉద్ధరించామని చెప్పుకునే కాంగ్రెస్‌పార్టీ నేతలు రాష్ట్రంలో రైతుల మేలుకోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తుంటే చూసి ఓర్వలేక నిస్సిగ్గుగా 24గంటల విద్యుత్ వద్దంటూ ప్రకటనలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.

01/04/2018 - 00:00

నాగర్‌కర్నూల్, జనవరి 3: దక్షిణ తెలంగాణపై కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వివక్షత చూపుతోందని, వచ్చే ఎన్నికలలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఒక స్థానం కూడా రాదని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

01/04/2018 - 00:00

మిర్యాలగూడ టౌన్, జనవరి 3: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఏపీ గ్రామీణ వికాస్‌బ్యాంక్‌లో రూ.2కోట్ల 86లక్షల 85వేల 661లు స్వాహా చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

01/03/2018 - 23:59

నల్లగొండ, జనవరి 3: మిషన్ భగీరథ పనులు జిల్లా ల్లో నిర్ధేశిత గడువులు దాటుతున్నా పైప్‌లైన్లు, ట్యాంకుల నిర్మాణాల సమస్యలను మాత్రం దాటలేకపోతోంది. ఇంటింటికీ నల్లా కనెక్షన్స్ ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి గ్రామాల్లో వేయాల్సిన అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణాలు వేగంగా సాగక మిషన్ భగీరథ ప్రాజెక్టును ఆలస్యం చేస్తోంది.

01/03/2018 - 23:41

పరిశ్రమల స్థాపనకు 30 కంపెనీలతో చర్చలు లక్షా 25 వేల మందికి ఉద్యోగావకాశాలు
త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి కేటీఆర్

01/03/2018 - 23:39

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. వోటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం, ఎన్నికల సమయం కావడంతో ప్రజలకు ఆకర్షణీయ వరాలను బడ్జెట్‌లో ప్రకటించే అవకాశముంది. ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

01/03/2018 - 23:37

హైదరాబాద్, జనవరి 3: ‘కరెంటుపై సీఎం కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్దాలే..’ అని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ విమర్శించారు. జనవరి 1నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

01/03/2018 - 23:35

ఒకవిధంగా తెలంగాణలో కమాండ్ కంట్రోల్ సేవలు మొదలైనట్టే. వివిధ విభాగాలకు సేవంలందించేందుకు టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్‌ను హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. పోలీసు సేవలకు టీపీసీ ఎంతగానో దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

01/03/2018 - 03:37

హైదరాబాద్, జనవరి 2: బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న నగరంలో బిసి విద్యుత్తు ఉద్యోగులతో మహా సభలు నిర్వహించాలని రాష్ట్ర బిసి విద్యుత్తు ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. కార్యవర్గ సమావేశానికి సంఘం అధ్యక్షుడు కె.

Pages