S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/01/2018 - 04:19

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 31: వేములవాడ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న అప్పటి పీపుల్స్‌వార్ సానుభూతిపరుడైన ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన నాగయ్య ఆచూకీ నేటికి లభించ లేదు. మూడు దళాబ్దాలుగా అతని కుటుంబీకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన నాగయ్య విప్లవపార్టీలో పని చేస్తున్నారా..లేక ఎన్‌కౌంటర్‌లో చనిపోయారా..? అనే ప్రశ్నలను తలెత్తుతున్నారు.

01/01/2018 - 04:17

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 31: రైతులకు వ్యవసాయ ఆధారిత సబ్సిడీ పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పక్కా చర్యలు చేపడుతోంది. ఇకనుంచి తయారీ, విక్రయదారుల అక్రమాలకు చెల్లుచీటీ పలుకుతూ, వారి ఆట కట్టించేందుకు సిద్ధమవుతోంది. ఎవరైనా అవినీతికి పాల్పడుతూ, ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేసేయత్నం చేస్తే, వారిని కటకటాల వెనక్కినెట్టేందుకు పక్కాగా ప్రణాళిక రచించింది.

01/01/2018 - 04:11

హైదరాబాద్, డిసెంబర్ 31: ముస్లింల సంక్షేమానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్రిపుల్ తలాక్ విధానాన్ని అరికడుతూ చట్టం తేవడం వల్ల ముస్లిం మహిళల హక్కులను రక్షించినట్లయిందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ త్రిపుల్ తలాక్ దురాచారం ఏళ్లతరబడి సాగుతోందని, ముస్లిం దేశాలు కూడా ఈ విధానాన్ని నిషేధించాయన్నారు.

01/01/2018 - 04:07

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్ పార్టీతో, విపక్ష కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వామపక్ష పార్టీలకు ఎన్నికల జ్వరం పట్టుకుంది. శీతాకాలంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వేడి వ్యాపించింది. మరో 16నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఎన్నికల మబ్బులు ఆవరిస్తున్నాయి.

01/01/2018 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్), ఫైర్ సర్వీస్‌లో పని చేసే పలువురికి పలు సేవా పతకాలను ప్రకటించింది. విశిష్ట సేవలు అందించినందుకు గాను ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తోంది. ఈ జాబితాను తెలంగాణ హోంశాఖ విడుదల చేసింది.

01/01/2018 - 04:05

ఖైరతాబాద్, డిసెంబర్ 31: మహానగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రోరైలు అందుబాటులోకి వచ్చిన నెల రోజులకే సాంకేతిక లోపం తలెత్తింది.

01/01/2018 - 04:13

హైదరాబాద్, డిసెంబర్ 31: అధికారంలో వచ్చేందుకు అన్ని రకాల హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడేంతవరకు కాంగ్రెస్ శ్రేణులు విశ్రమించరాదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరేందుకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, నేతలు ఉత్సాహం చూపుతున్నారని, టిఆర్‌ఎస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు.

01/01/2018 - 04:04

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆదివారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు.

01/01/2018 - 04:04

హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాద్ నగర పోలీస్ పరిధిలోని సిసిఎస్ విభాగం ఆవరణలో ‘సెంట్రల్ మానిటరింగ్ సెల్’ (సిఎంసి) ప్రారంభమయ్యింది. హైదరాబాద్ నగర పోలీసు పరిధిలో ఉన్న ఏ పోలీసు స్టేషన్ పరిధిలోనైనా ఏ కారణం చేతనైనా ఫిర్యాది దారుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇవ్వకపోతే ఈ సెల్‌ను సంప్రదించవచ్చని నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.

01/01/2018 - 04:03

హైదరాబాద్, డిసెంబర్ 31: జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం బాలల సంరక్షణ గృహాలు తప్పక నమోదు చేసుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశించింది. ఈ నిబంధన అమలు చేయకపోతే చట్ట ప్రకారం లక్ష రూపాయల జరిమాన, లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష, లేదా రెండూ విధించాల్సి ఉంటుందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం తప్పకుండా రిజిష్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.

Pages