S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/30/2017 - 03:19

హైదరాబాద్, డిసెంబర్ 29: టిఆర్‌ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ టార్గెట్ చేస్తున్నారని ఎస్సీల వర్గీకరణకు ద్రోహం చేసిన పార్టీల పంచన చేరారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. మందకృష్ణ మాదిగకు వర్గీకరణ లక్ష్యాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కావడం వల్లే అందరినీ కలుపుకుంటూ పోకుండా దండోరా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని అన్నారు.

12/30/2017 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 29: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్న అభ్యర్థుల ప్రయోజనార్ధం ఒక వెబ్‌పోర్టల్‌ను ఉపాధి, శిక్షణ శాఖ రూపొందించింది. ఆ పోర్టల్‌ను కార్మిక, ఉపాధి శాఖ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

12/30/2017 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 29: మహానగరానికి తీర ప్రాంతం లేకపోయినా, చేపలకు యమ ఆదరణ పెరిగింది. అంతేగాక, యాంత్రిక జీవనానికి అలవాటైపోయిన నగరవాసులు చికెన్, మటన్‌తో బోరైపోయి కొంతకాలంగా చేపలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈజీగా డైజెస్ట్ కావటంతో పాటు పోషక విలువలు ఎక్కువగా ఉండే చేప వంటకాలకు సైతం ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరిగింది.

12/30/2017 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 29: ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహించాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ రద్దు కావడంతో జనవరి 3 నుండి పిజి క్లాసులు ప్రారంభిస్తున్నట్టు వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు. రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ విద్యార్థులు తప్పనిసరి క్లాసులకు హాజరుకావాలని ఆయన సూచించారు.

12/30/2017 - 03:10

హైదరాబాద్, డిసెంబర్ 29: ప్రవేశపరీక్షల షెడ్యూలు విడుదల కావడంతో నాలుగు విశ్వవిద్యాలయాలు వివిధ ప్రవేశపరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈసారి ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు మినహా మిగిలిన అన్ని కోర్సులకు ఆన్‌లైన్‌లోనే ప్రవేశపరీక్షలు జరుగనున్నాయి. ఎమ్సెట్‌ను మే 2న బుధవారం నాడు ప్రారంభించి మే 5వ తేదీ శనివారం వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇసెట్‌ను మే 9న, ఐసెట్‌ను మే 17న నిర్వహించనున్నారు.

12/30/2017 - 03:09

హైదరాబాద్, డిసెంబర్ 29: ఇం డియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు రద్దు తో ప్రభుత్వానికి ఎలాంటి సంబం ధం లేదని టిఆర్‌ఎస్ పార్టీ ఖండించింది. ఈ సదస్సును నిర్వహించడానికి కొంత సమయం కావాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక మండలి కోరితే ప్రభుత్వానికి ఏమి సంబంధమని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

12/30/2017 - 03:09

హైదరాబాద్, డిసెంబర్ 29: నకిలీ డిసిపి అవతారం ఎత్తిన ఒకరిని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. చేస్తున్నది ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగం ఏకంగా నగర పోలీసు విభాగంలో డిసిపిని అంటూ నమ్మబలికి తెలిసిన వాళ్లను మోసం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి నగర టాస్క్ఫోర్స్ డిసిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/30/2017 - 03:08

హైదరాబాద్, డిసెంబర్ 29: హైదరాబాద్ నగరంలో మరో డ్రగ్స్ దందా బయటపడింది. ఒకేసారి పెద్ద మొత్తంలో 250 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హెరాయిన్‌ను టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.శ్రీనివాసరావు వివరించారు.

12/30/2017 - 03:08

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అసంఘటిత కార్మికుల సంఘం వైస్ చైర్మన్‌గా డాక్టర్ వంశీధర్ నాలిని నియమించినట్టు టిపిసిసి ఒక ప్రకటనలో పేర్కొంది. వైస్ చైర్మన్‌గా ఎంపికైన వంశీధర్ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పరిశీలకునిగా పని చేసారని టిపిసిసి అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పేర్కొన్నారు.

12/30/2017 - 03:07

హైదరాబాద్, డిసెంబర్ 29: దేశంలో కొద్ది రోజుల్లో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ రంగంలో సంచలన మార్పులు రానున్నాయని, బిహెచ్‌ఇఎల్ విద్యుత్ రంగం నిపుణుడు డాక్టర్ మోహనరావు పేర్కొన్నారు.

Pages