S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/30/2017 - 00:54

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గొడిశల రాజేశం గౌడ్ నియమించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఆర్థిక సంఘం సభ్యుడిగా రంగారెడ్డి జిల్లా కొత్తపల్లికి చెందిన రిటైర్డు జడ్పీ సిఇఓ మొండ్యాగు చెన్నయ్య కురమను నియమించారు.

12/30/2017 - 00:53

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్రంలో మహిళా సంఘాలకు 4 కోట్ల 79 లక్షల రూపాయలను స్ర్తి నిధి పరపతి సహకార సమాఖ్య శుక్రవారం గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వానికే లాభాల్లో వాటా ఇచ్చే స్థాయికి స్ర్తి నిధి ఎదిగిందని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

12/30/2017 - 00:50

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ టి తిరుపతిరావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ప్రతి ఏటా 10 శాతం మేర ఫీజు పెంపు చేసుకునేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారుచేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు, కమిటీ సభ్యులు మండిపడ్డారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసే సిఫార్సులను చేయవద్దని వారు కోరారు.

12/30/2017 - 00:49

హైదరాబాద్, డిసెంబర్ 29: యాచకులకు రక్షణ కల్పించి, వారికి తగిన వసతి కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఆనందాశ్రమం (షెల్టర్) విధానం సత్ఫలితాన్ని ఇచ్చిందని తెలంగాణ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ (డిజి) వికె సింగ్ తెలిపారు. నగరంలో యాచకుల సంచారం గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.500 నగదు బహుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు.

12/29/2017 - 20:29

మూడేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది విద్యుత్ రంగంలో పుంజుకుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. విద్యారంగంలోనూ ఈ ఏడాది రాష్ట్రం ముందడుగు వేసింది. పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసింది. వ్యవసాయ రంగానికి వస్తే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఒడిదుడుకుల మధ్య సాగింది.

12/29/2017 - 20:27

పంటల ఉత్పత్తికి సంబంధించి తెలంగాణ 2017-18 సంవత్సరంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రత్యేకంగా 2017 ఖరీఫ్ సీజన్ నిరాశాజనకంగా ఉంది. అయితే రబీ సీజన్ మాత్రం ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే 2015-16 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 36.28 లక్షల టన్నులు కాగా, 2016-17 లో 54.44 లక్షల టన్నులు వచ్చింది.

12/29/2017 - 20:25

వామపక్ష తీవ్రవాదానికి ఒకప్పుడు కోటగా ఉన్న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టగా, దేశ వ్యాప్తంగా కూడా ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 22.5 శాతం తగ్గినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వామపక్ష తీవ్రవాదం పశ్చిమబెంగాల్ నక్సల్బరి గ్రామంలో ఆవిర్భవించినా, దాని ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై 2005 వరకు తీవ్రంగా ఉండేది.

12/29/2017 - 20:08

తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాదే కాదు రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ తెలంగాణలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిజానికి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడినా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ చెప్పినా, ప్రజలు ఆ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు.

12/29/2017 - 20:07

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గెలుపుబిజెపి స్థానిక పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత ఏడాది కాలంగా అనేక అంశాలపై వెనువెంటనే స్పందించడంతో పాటు ఉద్యమాలు చేస్తూ, అసెంబ్లీలోనూ, శాసనమండలిలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజాచైతన్య కార్యక్రమాలను నిర్వహించడంలో బిజెపి విజయం సాధించింది.

12/29/2017 - 20:05

తెలంగాణ రాష్ట్రంలో మత్స్య, గొర్రెల కాపరుల పంట పండిందని చెప్పవచ్చు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇంతగా మత్స్య, గొర్రెల కాపరుల బాగోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మత్స్య, గొర్రెల కాపరులను ధనవంతులుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చర్యలు చేపట్టారు.

Pages