S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/29/2017 - 20:03

ఈ ఏడాది (2017) కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఎఐసిసి అధ్యక్షునిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడం పార్టీలో నూతనోత్తేజం కలిగించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్లు కమలంతో ‘్ఢ’కొంది. బిజెపి 99 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 80 సీట్లలో విజయం సాధించింది.

12/29/2017 - 20:01

ఈ ఏడాది కొత్తగా ఓ కొత్త పార్టీ ఆవిర్భవించగా, ఇంకా పలు పార్టీల స్థాపనకు కసరత్తు జరుగుతున్నది. 2014 సంవత్సరం జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అయితే ఈ ఏడాది జూన్ 2న డాక్టర్ చెరుకు సుధాకర్ ‘తెలంగాణ ఇంటి పార్టీ’ పేరిట కొత్త పార్టీని స్థాపించారు. సామాజిక న్యాయం లక్ష్యంగా కొత్త పార్టీని స్థాపించినట్లు ఆయన ప్రకటించారు.

12/29/2017 - 19:58

ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వ, అధికార టీఆర్‌ఎస్ ప్రతిష్ఠ ఇనుమడించిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో

12/29/2017 - 04:41

నిజామాబాద్, డిసెంబర్ 28: ప్రస్తుత రబీ సీజన్‌లో పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందిస్తున్నందున, నీటి విడుదల తీరుతెన్నులను నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుల్లో వెళ్లవద్దని సూచించారు.

12/29/2017 - 04:39

హైదరాబాద్ (ఖైరతాబాద్), డిసెంబర్ 28: హైకోర్టు విభజన కోసం పార్లమెంట్‌ను స్తంభింప చేసిన తెలంగాణ ఎంపీలు.. వర్గీకరణ విషయంపై ఎందుకు నిలదీయడం లేదని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలదీశారు. 23 ఏళ్లుగా ఎంఆర్‌పీఎస్ శాంతియుతంగా పోరాటం చేస్తుంటే వర్గీకరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని అన్నారు.

12/29/2017 - 04:31

హైదరాబాద్, డిసెంబర్ 28: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించే వేడుకలకు జిఎస్‌టి పన్ను వర్తిస్తుందని రాష్ట్ర వాణిజ్య పనులశాఖ కమిషనర్ వి అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహకులు తమ సంస్థలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నమోదు చేసుకోనివారు తమ వేడుకల టర్నోవర్‌ను అంచనా వేసి 28 శాతం పన్నును ముందస్తుగా చెల్లించినా సరిపోతుందని ఆయన పేర్కొన్నారు.

12/29/2017 - 04:31

హైదరాబాద్, డిసెంబర్ 28: సిద్ధిపేట జిల్లాలోని గ్రామాల్లో భూమి మార్కెట్ విలువలను సవరించుతూ, జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. ఎస్ నర్సింహారెడ్డి, మరో 23 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన కోర్టు, కేసు విచారణను వాయిదా వేసింది.

12/29/2017 - 04:30

హైదరాబాద్, డిసెంబర్ 28: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ మహ్మద్ బేగ్ ఇషాస్‌కు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం దక్కింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఉర్దూ విభాగంలో పనిచేసిన బేగ్ 2013 ఆగస్టులో పదవీవిరమణ చేశారు. ఆయన రాసిన ‘దుఖ్‌మా’ చిన్న కథకు సాహిత్య అవార్డు లభించింది. 1984లో ఉర్దూ విభాగంలో చేరిన ప్రొఫెసర్ బేగ్ కృష్ణచందర్ జీవితంపై పరిశోధన చేశారు.

12/29/2017 - 04:29

హైదరాబాద్, డిసెంబర్ 28: బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బి ఎస్ రాములు బతుకుపోరు, విలువలు పేరిట రచించిన రెండు గ్రంథాలను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసిన సందర్భంగా ఈ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.

12/29/2017 - 04:27

హైదరాబాద్, డిసెంబర్ 28: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ రద్దు కావడంపై వివిధ విద్యార్థి సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. సైన్స్ కాంగ్రెస్ మణిపూర్‌కు తరలిపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Pages