S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/29/2017 - 04:27

హైదరాబాద్, డిసెంబర్ 28: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో 10 ఎకరాల స్థలంలో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించబోయే గొల్ల, కురమల భవనానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. గొల్ల, కురుమల రాష్ట్ర భవనంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చే ఈ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మించనున్నారు.

12/29/2017 - 04:25

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణలో 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు జనవరి 1వ తేదీ నుంచి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ప్రకటించారు.

12/29/2017 - 04:24

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తీసుకున్న నిర్ణయం మేరకు మొదటి విడతగా 200 మంది బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా పథకం కింద హెల్త్ ఆరోగ్య కార్డులను అందిస్తున్నట్లు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ ,రాష్ట్రప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు.

12/29/2017 - 04:22

ఆదిలాబాద్, డిసెంబర్ 28 : ఉత్తరాది నుండి వీస్తున్న చలి గాలులతో ఆదిలాబాద్ జిల్లా గజగజ వణికిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విదంగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో 120 యేళ్ల చరిత్రలోనే అతి తక్కువగా బుధవారం 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా గురువారం తెల్లవారు జామున 3.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.

12/29/2017 - 04:44

నిజామాబాద్, డిసెంబర్ 28: మారుమూల తండాల్లోని అమాయక గిరిజన కుటుంబాలను ప్రలోభాల ఆశ కల్పించి, వారి పిల్లలను ఓ పథకం ప్రకారం మత మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ మిషనరీ సంస్థ నిర్వాహకుడి ఉదంతం బట్టబయలైంది. గుట్టుగా ఈ తతంగం సాగిస్తున్న తీరు గురించి ఫిర్యాదులు అందడంతో ఐసీడీఎస్ అధికారులు గురువారం దాడి చేయడంతో ఈ బాగోతం వెలుగుచూసింది.

12/29/2017 - 03:29

సంగారెడ్డి, డిసెంబర్ 28: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని ఆయా జిల్లాలకు గోదావరి జలాలను సాగుకు అందించడానికి నిర్మించ తలపెట్టిన కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో అడ్డంకులు, అవరోధాలను అధిగమించిన ప్రభుత్వం పనులను ప్రారంభించడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు.

12/29/2017 - 03:28

మహబూబ్‌నగర్, డిసెంబర్ 28: రోజుకో మాటమాట్లాడుతూ మాటలగారడీతో మభ్యపెడుతూ కండువా కప్పిన రోజే టీఆర్‌ఎస్ భవన్‌లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతూ ఉత్సవాలు నిర్వహిస్తున్న కేసీఆర్‌కు ఆ ఒక్క రోజే పండుగ అంటూ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

12/29/2017 - 03:27

నల్లగొండ, డిసెంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటైన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నాల్గవ విడత చెరువుల పునరుద్ధరణ పనుల ప్రతిపాదనల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా తుది దశకు చేరుకుంది. ప్రభుత్వం నుండి పరిపాలన ఆమోదం లభించడమే తరువాయి టెండర్ల ప్రక్రియను చేపట్టి పనులను ప్రారంభించేందుకు జిల్లాల యంత్రాంగం సన్నద్ధమైంది.

12/29/2017 - 03:27

హుజూర్‌నగర్, డిసెంబర్ 28 : రాష్ట్రంలో గత మూడున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అస్తవ్యస్త పాలన చేస్తున్నారని అభివృద్ధిలో అడుగు కూడా ముందుకు వేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లో జరుగుతున్న సూర్యాపేట జిల్లా ప్రథమ మహసభలలో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

12/29/2017 - 03:24

గచ్చిబౌలి, డిసెంబర్ 28: హత్యలు దారి దొపిడిలు, దొంగ తనాలతో దేశంలోని పలు ప్రాంతాల ప్రజలను పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసుల అరెస్టు చేశారు. ఒంటరిగా వెళ్తున్న మహిళ హత్య చేసి వారి వద్ద ఉన్న నగలు నగదును దొచుకునే కరుడుగట్టిన అంతర్ రాష్ట్ర పార్ధి గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Pages