S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/29/2017 - 03:21

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పతంగుల పండుగను జనవరి 13 నుండి 15వ తేదీ వరకూ పెరేడ్ మైదానంలో నిర్వహించనుంది. దీనికి అనుబంధంగా స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన బేగంపేట టూరిజం ప్లాజా హోటల్‌లో వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/29/2017 - 03:21

హైదరాబాద్, డిసెంబర్ 28: ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న పార్టీకి నమ్మక ద్రోహం చేశారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆరోపించారు. ఆయన పేరుతో ఒక లేఖ మీడియాకు విడుదలయ్యింది. మావోయిస్టు పార్టీ నుంచి ఏడాది కిందటే జంపన్నను సస్పెండ్ చేశారని తెలిపారు.

12/29/2017 - 03:20

హైదరాబాద్, డిసెంబర్ 28: సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తత్రంగా విస్తరించడంతో ఆ తరహాలోనే నేరాలు పెరుగుతూ వస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు ఆన్‌లైన్ విధానమే వేదిక అవుతోంది. ఇంటర్నెట్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నా, అంతే స్ధాయి లో అవస్థలు వచ్చిపడుతున్నాయి. భారీ సైబర్ నేరాలు, మోసాలు సంగతి ఎలా ఉన్నా, సెక్స్ రాకెట్ల విషయానికొస్తే గల్లీ స్ధాయి వ్యభిచార వృత్తి కాస్త ఆన్‌లైన్‌లోకి ఎక్కింది.

12/29/2017 - 03:20

హైదరాబాద్, డిసెంబర్ 28: రాజ్యాంగంలో చెప్పిన విధంగా 29 అంశాలను గ్రామ పంచాయితీలకు బదిలీ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలన్నారు. సుప్రీం కోర్టు చెప్పి న విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50శాతం మించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

12/29/2017 - 03:17

వేములవాడ,డిసెంబర్ 28:ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టి.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఆలయ సూపరింటెండెంట్ నామాల రాజేందర్‌ను విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం ఆలయ కార్యనిర్వహణాధికారి దూస రాజేశ్వర్ ఉత్వర్వులను జారీ చేశారు. ప్రసాదాల తయారీవిభాగంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నామాల రాజేందర్ ఇంటిపై ఈనెల 21న ఏసీబీ అధికారులు ముప్పెట దాడులు చేశారు.

12/29/2017 - 03:17

హైదరాబాద్, డిసెంబర్ 28: పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణకు స్పీకర్ చైర్మన్‌గా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసినట్టు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నరసింహాచార్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీకి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చైర్మన్‌గా వ్యవహరించనుండగా ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా వ్యవహరిస్తారు.

12/28/2017 - 01:29

చౌటుప్పల్, డిసెంబర్ 27: పల్లె ప్రజలకు నీతివంతమైన పాలన అందించేందుకు పంచాయతీరాజ్ కొత్త చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం శివారులోని నిలగిరిలో బుధవారం ఆయన కొద్దిసేపు ఆగారు.

12/28/2017 - 01:29

న్యూఢిల్లీ, డిసెంబరు 27:ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.్ఢల్లీలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజన జరగాలని తెలంగాణ బీజేపీ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని,దీనిపై సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తికి లేఖ కూడా రాసినట్టు చెప్పారు.హైకోర్టు విభజన కేంద్రం పరిధిలో లేదని,దీనిపై హైకోర్టులో పిటిషన్

12/28/2017 - 01:28

కోస్గి, డిసెంబర్ 27: టీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న మంత్రులంతాఆయన చేతుల్లో కీలుబొమ్మలని తాండూర్‌లో చెల్లని మంత్రి మహేందర్‌రెడ్డి కొడంగల్‌లో చెల్లుతానని ఎలా పర్యటిస్తున్నారో అర్థం కావడం లేదని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు.

12/28/2017 - 01:27

హైదరాబాద్, డిసెంబర్ 27 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు వీలుగా చాలా ముందుగానే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. బూత్ కమిటీలు , నియోజకవర్గాల వారీ పూర్తికాలిక బాధ్యులను సిద్ధం చేశామని, వచ్చే ఏడాది పొడవునా ప్రజా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.

Pages