S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/27/2017 - 23:05

ఆసిఫాబాద్, డిసెంబర్ 27: లంబాడాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు చేపడుతున్న ఆందోళనల వెనక ఉన్నది మావోయిస్టులు కాదని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. కొంత మంది మాజీలు అన్నీ తామై ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తున్నారన్నారు.

12/27/2017 - 23:04

హైదరాబాద్, డిసెంబర్ 27: మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. గత పదిరోజులుగా కృష్ణమాదిగ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ తన అనుచరులతో 10 రోజుల కిందట ర్యాలీ నిర్వహించిన సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

12/27/2017 - 23:04

రామచంద్రాపురం, డిసెంబర్ 27 : అనంత విశ్వంలో ప్రతి జీవి స్వేచ్ఛా జీవేనని, అణగారిన పిల్లలను ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగే పరిస్థితులను నేటి సమాజమే కల్పించాలని మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎస్మా వోలోడర్ అన్నారు. బాలల జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ, చదువు, ఆటలు, వినోదం తదితర వాటిని సమాజం నుండి పొంది వారి హక్కులపై వారికి చిన్నతనం నుండే అవగాహన ఏర్పర్చుకోవాలని ఆమె సూచించారు.

12/27/2017 - 23:03

కరీంనగర్ డిసెంబర్ 27: భర్త, అత్త, మామలు వేధిస్తున్నారంటూ కోడళ్లు గృహహింస కేసులు పెట్టిన సంఘటనలు మనం చూశాం కానీ, దానికి భిన్నంగా భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ భర్త కోర్టు గుమ్మం తొక్కడం సంచలనం రేపుతోంది. భార్య, వారి కుటుంబ సభ్యులు పెట్టే గృహహింస బాధలు భరించలేక భర్త కరీంనగర్ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది ద్వారా దావా దాఖలు చేశారు.

12/27/2017 - 04:42

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ఈ వర్సిటీ వైస్-్ఛన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావు తెలిపారు. ‘వ్యవసాయ పరిశోధన వ్యవస్థలో సామాజిక శాస్త్రాల పాత్ర’ అన్న అంశంపై మంగళవారం యూనివర్సిటీ కేంద్ర గ్రంథాలయంలో జరిగిన చర్చలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

12/27/2017 - 04:37

హైదరాబాద్, డిసెంబర్ 26: దేశంలో సివిల్ వార్ తీసుకుని వచ్చేందుకు హిందు త్వ శక్తులు కుట్ర చేస్తున్నాయని సిపిఐ జాతీ య ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. సిపిఐ తెలంగాణ సమితి అధ్వర్యంలో మంగళవారం పార్టీ 92వ ఆవిర్భావ వార్షికోత్సవాలను పురస్కరించుకుని బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

12/27/2017 - 04:28

హైదరాబాద్, డిసెంబర్ 26: పార్లమెంటులో బిసి బిల్లు పెట్టించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య రాష్టప్రతి రాంనాథ్ కోవింద్‌ను కోరారు. మంగళవారం ఆర్. కృష్ణయ్య, గుజ్జ కృష్ణ నాయకత్వంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు పలువురు రాష్టప్రతి కోవింద్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

12/27/2017 - 04:27

హైదరాబాద్, డిసెంబర్ 26: విశ్వవిద్యాలయాలు సరస్వతీ నిలయాలుగా ఉండాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా పరిశోధనలు జరగాలని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెలంగాణలోని ఒక విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి సంఘం నేతలు, కార్యకర్తలు పుస్తకాలను తగులబెట్టడం శోచనీయమన్నారు. విశ్వవిద్యాలయాలు ‘విష’ విద్యాలయాలుగా మారకూడదన్నారు.

12/27/2017 - 04:26

శంషాబాద్, డిసెంబర్ 26: యువకుడిని దారుణంగా చంపేసి మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ పద్మజ, ఏసీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.

12/27/2017 - 04:34

హైదరాబాద్, డిసెంబర్ 26: డెల్ సంస్థ కొత్త ఇన్‌స్పిరాన్ ఆల్ట్రా స్లిమ్ నోట్‌బుక్స్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్ ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండి వినోదాత్మక వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండేటట్లు తీర్చిదిద్దినట్లు డెల్ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ ఎలిన్ జోయి జోష్ తెలిపారు.

Pages