S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/06/2017 - 03:46

హైదరాబాద్, డిసెంబర్ 5: ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిథిలో వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో సీతారామ సాగు నీటి ప్రాజెక్టు చేపట్టేందుకు వీలుగా అటవీ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు తాజాగా లేఖ రాశారు.

12/06/2017 - 03:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: నిజాం పాలన కాలంలోని నియంతృత్వ పోకడలు కంటే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్ నిరంకుశ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో అరుణ విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు తెలియవు, కేవలం తండ్రీకొడుకులు అధికార దర్పంతో, అహకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

12/06/2017 - 03:45

హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ల ఆగడాలు రోజురోజుకూ శృతిమించడంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తున్నా యాజమాన్యాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం , టీచర్లు ఒక విద్యార్థిని వేధింపులకు గురిచేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

12/06/2017 - 03:41

హైదరాబాద్, డిసెంబర్ 5: మెట్రోరైళ్ల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె తారకరామారావు ఆదేశించారు. మెట్రోరైలు ప్రయాణానికి ప్రజల నుంచి భారీ స్పందన ఉన్న నేపథ్యంలో రైళ్లను పెంచాలని మంత్రి సూచించారు. ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఫిబ్రవరిలో రైళ్ల ఫ్రీకెన్సీనీ పెంచుతామని అధికారులు తెలిపారు.

12/06/2017 - 03:39

హైదరాబాద్, డిసెంబర్ 5: ఉస్మానియా వర్సిటీ వసతి గృహాంలో విద్యార్థి మురళి ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై అన్యాయంగా, అక్రమంగా పోలీసులు కేసులు పెట్టారని ఆయన విమర్శించారు.

12/06/2017 - 03:36

హైదరాబాద్, డిసెంబర్ 5: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మురళీ ఆత్మహత్య, అనంతర పరిణామాలతో విద్యార్ధులపై లాఠీచార్జీని నిరసిస్తూ ఎబివిపి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నాడు విశ్వవిద్యాలయాల బంద్ ప్రశాంతంగా జరిగింది. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించడంతో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు జైలుకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.

12/06/2017 - 04:02

హైదరాబాద్, డిసెంబర్ 5: రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉన్న 36 శాసనసభా నియోజకవర్గాల్లో (మున్సిపల్ కార్పోరేషన్లు కలిగిన) ఇటీవల జరిపిన ఇంటింటికి సర్వే సందర్భంగా 24,20,244 ఓటర్లపేర్లను తొలగించామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి అనూప్ సింగ్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, సర్వే తర్వాత 91,06,862 మంది ఓటర్లుగా ఉన్నట్టు తేలిందన్నారు.

12/06/2017 - 03:34

హైదరాబాద్, డిసెంబర్ 5: బంగారు తెలంగాణ సాధనకు విజన్ డాక్యుమెంట్ -2024 సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించి మూడేళ్లు గడచిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న మానవవనరులు, వౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగం, ఐటి, వ్యవసాయ, సాగునీటి రంగాలను పరిగణనలోకి తీసుకుని బంగారు తెలంగాణ సాధనకు ఒక డాక్యుమెంట్‌ను తయారు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు.

12/06/2017 - 03:34

హైదరాబాద్, డిసెంబర్ 5: హైదరాబాద్‌లో ఈనెల 15 నుంచి 19 వరకు నిర్వహించతలపెట్ని ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని విప్లవ రచయితల సంఘం పిలుపునిచ్చింది. తెలుగు నేలపై నలభై రెండేళ్లలో మూడోసారి మహాసభలు జరుగుతున్నాయని, వీటిని ప్రతీసారి ప్రభుత్వమే నిర్వహిస్తుందని విప్లవ రచయితల సంఘం తెలిపింది.

12/06/2017 - 03:33

హైదరాబాద్/కాచిగూడ, డిసెంబర్ 5: ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసినప్పటికి నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరదని స్వయం ఉపాధిపై యువత దృష్టి సారించాలని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ మీ-సేవ రూ.10కోట్ల లావాదేవిలు జరిపినందుకు తెలంగాణ మీ-సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ..

Pages