S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/05/2017 - 04:55

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.

12/05/2017 - 04:55

హైదరాబాద్, డిసెంబర్ 4: ఉడుకు రక్తం..క్షణికావేశంలో నేరాలకు పాల్పడేది మూడు పదుల లోపు ఉన్నవారే. కానీ 30 నుంచి 45 వయస్కులే ఎక్కువ నేరాలకు పాల్పడుతున్నారని దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. దేశంలోని మెట్రో నగరాల్లో నేరాల తీరును పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో ఇందుకు భిన్నంగా ఉంది. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారి కంటే 30 నుంచి 45 మధ్య వయసున్న వాళ్లే అధికంగా నేరాలకు పాల్పడుతున్నారు.

12/05/2017 - 04:54

హైదరాబాద్, డిసెంబర్ 4: బిసిలు, అణగారిన వర్గాల పాలిట కెసిఆర్ దేవుడు అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్‌లు కొనియాడారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులంతా కలిసి అచ్చంపేటలో ఆదివారం నిర్వహించింది ప్రజా గర్జన కాదని, పదవీ వ్యామోహ గర్జన అని ఎద్దేవా చేశారు.

12/05/2017 - 04:54

హైదరాబాద్, డిసెంబర్ 4: తమిళనాడులోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ హీరో విశాల్‌రెడ్డికి మద్దతు ఇచ్చే అంశంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

12/05/2017 - 04:53

హైదరాబాద్, డిసెంబర్ 4: నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఉద్యోగాల సాధన కోసం యువత పోరుబాట పట్టాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సిఐటియు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఉద్యోగాలు రావడం లేదని మనస్థాపానికి గురై ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన పిజి విద్యార్థి ఈ.మురళి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని అన్నారు.

12/05/2017 - 04:53

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి పంటల కొనుగోలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. కందులు తదితర పంటల ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి నాఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు.

12/05/2017 - 02:39

సిరిసిల్ల, డిసెంబర్ 4: గత ప్రభుత్వాలు గంటెడు నీళ్లిచ్చే ఆలోచన చేయలేదని, సగటు వర్షపాతం కంటే దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది తెలంగాణలోనే అయినా కరవు ప్రాంతంగా తెలంగాణను చిత్రీకరించారని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు.

12/05/2017 - 00:20

హైదరాబాద్, డిసెంబర్ 4: బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా ఈ నెల 6వ తేదీన తెలంగాణ బంద్‌కు మజ్లీస్ బచావ్ తహరీక్ (ఎంబిటి) పిలుపునిచ్చింది. ఎంబిటి అధ్యక్షుడు మజీద్ ఉల్లా ఖాన్ సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లౌకికవాదాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారంతా ఈ నెల 6న చీకటి దినంగా పాటించి బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

12/05/2017 - 00:19

హైదరాబాద్, డిసెంబర్ 4: బాబ్రీమసీదు కూల్చివేతను నిరసిస్తూ ఈ నెల 6న చీకటి దినం (బ్లాక్‌డే)గా పరిగణించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇప్పటికే వామపక్ష పార్టీలు నిర్ణయం ప్రకటించాయి. సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐయు, ఆర్‌ఎస్‌పి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ ఎంల్ లిబరేషన్, ముస్లిం సంస్థలు పిలుపునిచ్చాయి.

12/05/2017 - 00:19

హైదరాబాద్, డిసెంబర్ 4: ఈనెల 6న బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ బుధవారం పాతబస్తీలో ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరించారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం నుంచి 7వ తేదీ ఉదయం వరకు 144వ, సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు.

Pages