S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/07/2017 - 04:34

నిజామాబాద్, నవంబర్ 6: రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పం టల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలని గోదావరి బేసిన్ కమిషన్ చైర్మన్ ఆర్.మధుసూదన్‌రావు కోరారు. ధాన్యానికి బదులుగా మొక్కజొన్న, సోయా పంటలను సాగు చేయడం వల్ల నీటి ఇబ్బందులు తలెత్తకుండా అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన హితవు పలికారు.

11/07/2017 - 04:33

గజ్వేల్, నవంబర్ 6: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి ఎస్సీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఛలో హైదరాబాద్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 738 మంది ఉపాధ్యాయులు గజ్వేల్‌కు చేరుకొని పాదయాత్రకు సమాయత్తమయ్యారు.

11/07/2017 - 04:06

హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయతో అద్భుత ఫలితాలను సాధించామని సాగునీటి పారుదల మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సోమవారం నాడు ఆయన శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు మిషన్ కాకతీయ ఆదర్శప్రాయమైన కార్యక్రమంగా మారిందని అన్నారు. మూడు విడతల మిషన్ కాకతీయలో 15,499 చెరువులను పునరుద్ధరించామని, 10,30,711 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని పేర్కొన్నారు.

11/07/2017 - 04:03

హైదరాబాద్, నవంబర్ 6: ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్ల అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. ప్రతి పనికి కమిటీని ఏర్పాటు చేసి పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన తెలుగు మహాసభల ఏర్పాట్ల గురించి సమీక్షించారు.

11/07/2017 - 03:11

హైదరాబాద్, నవంబర్ 6: ఉత్తరాఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం రామచంద్రన్ రాసిన ‘ద మెవరిక్స్ ఆఫ్ ముస్సోరి’ పుస్తకాన్ని ఆస్కి చైర్మన్ కె పద్మనాభయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథ రచయితతో ప్రముఖ రచయిత శ్రీరాం కర్రి సంభాషణ ఏర్పాటు చేశారు. ఈ పుస్తకానికి ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ముందు మాట రాశారు. పట్టణాభివృద్ధి శాఖల మంత్రులుగా ఎస్ జైపాల్‌రెడ్డి, ఎం వెంకయ్యనాయుడుల వద్ద కూడా రామచంద్రన్ పనిచేశారు.

11/07/2017 - 03:10

హైదరాబాద్, నవంబర్ 6: ఆచార్య కె శివారెడ్డికి కబీర్ సమ్మాన్ అవార్డు దక్కింది. ఈ నెల 10వ తేదీన భోపాల్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన రాష్టప్రతి చేతులు మీదుగా ఈ అవార్డును అందుకుంటారు. తెలుగు కవిత్వంలో గత ఐదు దశాబ్దాలుగా నిర్విరామంగా చేస్తున్న కృషికి ఓ మెచ్చుకోలుగా భాషాభిమానులు హర్షిస్తున్నారు.

11/07/2017 - 03:09

హైదరాబాద్, నవంబర్ 6: ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో సోమవారం రూ.2 లక్షలు అపహరణకు గురయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పనిచేస్తున్న చెన్నయ్య అలియాస్ చిన్న అనే వ్యక్తి డబ్బుతో ఉడాయించినట్టు చిరు వ్యక్తిగత సహాయకుడు గంగాధర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

11/07/2017 - 03:08

హైదరాబాద్, నవంబర్ 6: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి డి.శ్రీ్ధర్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వు చేసింది. ఎన్‌డిపిఎస్ చట్టం కింద చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని, ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని శ్రీ్ధర్‌బాబు తరఫు న్యాయవాది వేదుల వెంకట రమణ పేర్కొన్నారు.

11/07/2017 - 03:07

హైదరాబాద్, నవంబర్ 6: కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, తెలంగాణకు పట్టిన శని అని మంత్రి కె తారకరామారావు దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులన్ని కాల్చి చంపిన చరిత్ర ఆ పార్టీదని మంత్రి విమర్శించారు. నల్లగొండ జిల్లాకు చెందిన టిటిడిపి నేతలు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డితో పాటు పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం టిఆర్‌ఎస్‌లో చేరారు.

11/07/2017 - 03:05

హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణలోని ప్రధాన దేవాలయాలైన భద్రాచలం, వేములవాడ, బాసర, యాదాద్రి తదితర దేవాలయాల కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తున్నట్టు దేవాదాయ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో సోమవారం ఆయన దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Pages