S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/08/2017 - 02:43

నల్లగొండ, అక్టోబర్ 7: ఉద్యమాల గడ్డ నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, టిఆర్‌ఎస్ మూడేళ్ల పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి ఉందని నల్లగొండ పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తే ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని సిఎల్పీ ఉప నేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

10/08/2017 - 02:43

గోదావరిఖని, అక్టోబర్ 7: అధికార పార్టీ టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం... సింగరేణిలో రెండవసారి విజయఢంకా మోగించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) కేంద్ర నాయకత్వాన్ని మొత్తంగా ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం కసరత్తులను ప్రారంభించింది. ఫిట్ కమిటీ నుంచి కేంద్ర కమిటీ వరకు ఉన్న పాత నాయకత్వం అందరికీ మంగళం పాడేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

10/08/2017 - 02:42

కడెం, అక్టోబర్ 7: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజిపేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి అసునూరి భీమేష్(38), అసునూరి శైలజ (32) అనే భార్య భర్తలు అప్పుల బాధ భరించలేక పురుగుల మందుసేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వారి కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్సల నిమిత్తం తరలించారు.

10/08/2017 - 02:42

మోటకొండూరు, అక్టోబర్ 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య పాలనను ఎండగడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే పోరుబాట నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ, సమగ్రాభివృద్ధికి సిపిఐ చేపట్టిన పల్లెపల్లెకు పోరుబాట కార్యక్రమం శనివారం మండల కేంద్రానికి చేరుకుంది.

10/08/2017 - 02:04

హైదరాబాద్/ నార్సింగి, అక్టోబర్ 7: నకిలీ విదేశీ మద్యం సరఫరా చేస్తున్న ఓ ముఠాను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం మద్యాహ్నం తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకర్లుకు కమిషనర్ చంద్రవదన్ వివరాలను వెల్లడించారు.

10/08/2017 - 02:02

హైదరాబాద్, అక్టోబర్ 7: యాదగిరిగుట్టపై ఈ నెల 20 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించే శ్రీ పంచాయతన సహిత ఆయుత శ్రీ మహావిష్ణు మహాయాగానికి హాజరు కావాలంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నిర్వహకులు కోరారు. దర్శనం మాసపత్రిక సంపాకుడు ఎంవిఆర్ శర్మ తదతరులు శనివారం ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వేదపండితుడు రాజశేఖరర శర్మ ముఖ్యమంత్రికి ఆశీర్వచనం చేశారు.

10/08/2017 - 01:59

హైదరాబాద్, అక్టోబర్ 7: దేశ వ్యాప్తంగా రానున్న నాలుగేళ్లలో 33 వేల రూట్ కిలోమీటర్ల మార్గాన్ని విద్యుదీకరణ చేపడుతున్నట్లు రైల్వే బోర్డు సభ్యుడు (ట్రాఫిక్) మహ్మద్ జెమ్‌షెద్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1180 మిలియన్ టన్నుల సరుకు రవాణా పూర్తి చేయాలని నిర్ధేశిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

10/08/2017 - 01:58

హైదరాబాద్, అక్టోబర్ 7: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు తనతో మాట్లాడే సత్తా, శక్తి లేదని సిఎల్‌పి నేత జానారెడ్డి విమర్శించారు. కెసిఆర్ కలత చెంది, కలవరపడి మాట్లాడారని, అది చాలా అసహ్యంగా ఉందని జానారెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. కొత్త రాష్ట్రంలో కొత్త విలువలు, సంప్రదాయాలు ఉండాలన్నారు. పరస్పరం సహకరించుకుందామని చాలా కాలంగా తాను సూచిస్తూనే వచ్చానని ఆయన గుర్తు చేశారు.

10/08/2017 - 01:58

హైదరాబాద్, అక్టోబర్ 7: విశ్వాసానికి ప్రతీక కోదండరాం అయితే విశ్వాసఘాతుకానికి పెట్టింది పేరు కెసిఆర్ అని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.సింగరేణి ఎన్నికల ఫలితాలపై సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు, కోదండరాంపైనా చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు.

10/08/2017 - 01:56

హైదరాబాద్, అక్టోబర్ 7: భారతీయ జనతా పార్టీ మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని బిజెఎల్పీ నేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ మేమే తెచ్చామని కెసిఆర్ మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తుంటే పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గట్టిగా మాట్లాడారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.

Pages