S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/05/2017 - 21:58

హైదరాబాద్, అక్టోబర్ 4: హరితహారం పథకానికి అంకురార్పణ జరిగిన సందర్భంగా రెండు సంవత్సరాల కిందట చిలుకూరు బాలాజి దేవాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాటిన సంపెంగ మొక్క నేడు చెట్టుగా ఎదిగి వెంకన్నకు పూలు, పత్రాలను అందిస్తూ తరిస్తోంది.

10/04/2017 - 23:22

భువనగిరి, అక్టోబర్ 4: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తిచేసేందుకు క్యాలెండర్ ప్రకటించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరేందుకే కొలువుల కొట్లాట ప్రారంభించామని రాష్ట్ర జెఎసి చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జెఎసి ఏర్పాటుచేసిన కొలువుల కొట్లాట సదస్సుకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

10/04/2017 - 01:16

గోదావరిఖని, అక్టోబర్ 3: సింగరేణి బొగ్గు పరిశ్రమలో గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికల ప్రచారాలను తలదనే్న రీతిలో సాగుతోంది. 53వేల మంది కార్మికులు సింగరేణివ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, దీనిలో మెజార్టీ కోసం కార్మిక సంఘాలు తమదైన శైలిలో ప్రలోభాలకు తెగబడుతున్నాయ. ఈ ఎన్నికల్లో ప్రతీ కార్మికుని ఓటూ ఇక్కడ కీలకమే.

10/05/2017 - 21:59

హైదరాబాద్, అక్టోబర్ 3: రెండు రోజుల భారీ వానలతో తెలంగాణ రాజధాని అతలాకుతలమైంది. మరో రెండు రోజులు భారీ వానలు తప్పవన్న హెచ్చరికలతో ఇటు ప్రజానీకం భయాందోళనలకు గురవుతుంటే, అటు ప్రభుత్వ యంత్రాంగం పరుగులు పెడుతోంది. రెండో రోజూ మంగళవారం గంటల వ్యవధిలో కురిసిన ఎడతెరిపిలేని వానతో రాష్ట్ర రాజధాని సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

10/05/2017 - 21:56

నిజామాబాద్, అక్టోబర్ 3: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ జలాశయానికి పునరుజ్జీవ పథకమే ప్రత్యామ్నాయ ఆధారంగా మారింది.

10/03/2017 - 22:41

హైదరాబాద్, అక్టోబర్ 3: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీలో అవకతవకలు జరగకుండా చూసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

10/03/2017 - 03:52

కరీంనగర్, అక్టోబర్ 2: సింగరేణి గుర్తింపు ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తోంది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెర పడనుండగా, గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ గుర్తింపు ఎన్నికల్లో ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో ఇరువర్గాలు ప్రచారాన్ని హోరెత్తించి, నల్ల సూరీళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

10/03/2017 - 03:51

ఆదిలాబాద్, అక్టోబర్ 2: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రచార హోరు తారస్థాయికి చేరుకుంది. కార్మిక సంఘాలకు రాజకీయ రంగు పులుముకోవడంతో రాష్ట్ర నేతలంతా గనుల్లో మకాం వేసి ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం సాయంత్రం నాటికి ప్రచార గడువు ముగియనుండడంతో కార్మిక సంఘాలు ఎత్తుకు పై ఎత్తులతో తాయిలాల ఆశలు కల్పిస్తూ ఇంటింట ప్రచారంతో దూసుకెళ్తున్నాయి.

10/03/2017 - 03:51

యైటింక్లయిన్‌కాలనీ, అక్టోబర్ 2: సింగరేణి కార్మికులను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కుట్రలు పన్నుతున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్ బాబు అన్నారు. సోమవారం సింగరేణి ఆర్జీ-2 ఓసిపి-3 కృషి భవన్‌లో ఐఎన్‌టియుసి, ఎఐటియుసి యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది.

10/03/2017 - 03:50

నిజామాబాద్, అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగంలో కొనసాగుతున్న ఏకైక చక్కెర కర్మాగారమైన నిజామాబాద్ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ (ఎన్‌సిఎస్‌ఎఫ్) పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్‌సిఎస్‌ఎఫ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్షాలన్నీ ఏకతాటిపైకి చేరి అనేక పర్యాయాలు ఆందోళనలు నిర్వహించినా ఫలితం శూన్యంగానే ఉంటోంది.

Pages