S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/17/2016 - 12:09

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఖైరతాబాద్‌లో విగ్రహం ఎత్తును తగ్గించాలని పోలీసులు ఒత్తిడి తేవడాన్ని తాము సహించేది లేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ హెచ్చరించింది.

06/17/2016 - 12:08

హైదరాబాద్: తెలంగాణ టెట్- 2016 పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 54.45 శాతం మంది, పేపర్ 2లో 24.04 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

06/17/2016 - 12:08

హైదరాబాద్: స్కూల్ ఆవరణలో బస్సును రివర్స్ చేస్తుండగా దాని కింద ప్రమాదవశాత్తూ పడి నాలుగేళ్ల విద్యార్థి మరణించాడు. ఈ విషాదం చింతల్ వద్ద వివేకానందనగర్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్‌ను రివర్స్ చేస్తుండగా ఎల్‌కెజి విద్యార్థి జశ్వంత్ రెడ్డి దాని కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

06/17/2016 - 12:07

మెదక్: పది రూపాయలను దొంగిలించాడని ఆగ్రహం చెందిన ఓ కన్నతండ్రి తన పదేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపేసిన దారుణ ఘటన మెదక్ జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెంలో శుక్రవారం వెలుగు చూసింది. ఆవేశానికి లోనై కొడుకును చంపిన సత్తెయ్యను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

06/17/2016 - 08:13

హైదరాబాద్, జూన్ 16:అర్హులైన లబ్దిదారులందరికీ జూలై ఆఖరు నాటికి రేషన్ కార్డులు అందజేయనున్నట్టు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి నిర్దేశిత కోటా ప్రకారం బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని అన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులతో మంత్రి ఈటల గురువారం పౌర సరఫరాల శాఖపై సమావేశం జరిపారు.

06/17/2016 - 08:13

హైదరాబాద్,జూన్ 16: తనకు పోలీసు భద్రతను పెంచాలంటూ తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ విషయమై ఆలోచించి అవసరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. అనంతరం ఈ కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసును గురువారం న్యాయమూర్తి ఏ రాజశేఖరరెడ్డి విచారించారు.

06/17/2016 - 08:12

హైదరాబాద్, జూన్ 16: పార్టీ ఫిరాయించిన నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిపై అనర్హత అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో తెరాస సాగిస్తోన్న ఫిరాయింపుల రాజకీయాలను జాతీయ స్థాయిలో చర్చ చేయాలన్న దిశగా అడుగులు వేస్తోంది.

06/17/2016 - 08:12

హైదరాబాద్, జూన్ 16: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ. 530 కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని బిసీలు, ఇబిసిలకు కూడా వర్తింప చేయడంతో దీనికి రూ. 738 కోట్లు కేటాయించినట్టు ముఖ్యమంత్రి వివరించారు.

06/17/2016 - 08:11

హైదరాబాద్, జూన్ 16: ‘రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నారు, మరి మన ఊరి సంగతి ఏమి చేశార’ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును ఆయన సొంత ఊరికి చెందిన చింతకమడక వాసులు ప్రశ్నించారు. మెదక్ జిల్లా సిద్ధిపేట మండంలోని చింతకమడక ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత గ్రామమన్న విషయం తెలిసిందే. ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు గురువారం క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి ముఖ్యమంత్రిని కలిశారు.

06/17/2016 - 08:10

హైదరాబాద్, జూన్ 16: వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించి మూడవ విడత వాయిదా ను త్వరలోనే చెల్లిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బ్యాంకర్లకు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున క్షేత్ర స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్వరం రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఖరీఫ్ రుణాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం సచివాలయంలో ఆరు ప్రధాన బ్యాంకు అధికారులతో సమావేశం అయ్యారు.

Pages