S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/02/2017 - 02:14

హైదరాబాద్, అక్టోబర్ 1: కేంద్రంలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కృష్ణయ్య ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.

09/30/2017 - 03:17

ఆంధ్రభూమి పాఠకులు, ప్రకటనకర్తలకు
విజయదశమి శుభాకాంక్షలు

-చీఫ్ ఎడిటర్

దసరా పర్వదినం సందర్భంగా శనివారం మా కార్యాలయానికి సెలవు. ఆదివారం సంచిక వెలువడదు.

09/30/2017 - 02:35

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 29: అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దేందుకు కలలుకంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన సహచర ఎమ్మెల్యే బొడిగె శోభ చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఎందుకు స్పందించడంలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ప్రశ్నించారు.

09/30/2017 - 02:34

నల్లగొండ, సెప్టెంబర్ 29: దసరా సందర్భంగా సెలవుల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి.

09/30/2017 - 02:32

మర్రిగూడ, సెప్టెంబర్ 29: ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ అన్నం పెట్టే భూములను ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చే భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

09/30/2017 - 02:30

ఆర్మూర్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం స్లాబ్ కూలి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలూర్ గ్రామంలోని కండె రాయుడు ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నవమి సందర్భంగా మానాయి కోసం గొర్రెలను బలి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

09/30/2017 - 01:53

హైదరాబాద్, సెప్టెంబర్ 29: చేతి ఉత్పత్తులకు జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రచారంలో భాగంగా అక్టోబర్ 1న జిఎస్‌టి విధించకుండా చేనేత ఉత్పత్తులు విక్రయించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ హేండ్‌లూమ్ ఆర్గనైజేషన్స్ ప్రకటించింది. శుక్రవారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ సర్దార్ పటేల్ రోడ్‌లో ఉన్న తమ కార్యాలయం వద్ద జిఎస్‌టి లేకుండా ఈ వస్త్రాలను విక్రయించనున్నట్లు తెలిపింది.

09/30/2017 - 01:52

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తమిళనాడు తరహాలో రాష్ట్రంలోనూ బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి.హనుమంత రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత బిసిలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బిసి సబ్-ప్లాన్ అమలు చేయాలని ఆయన కోరారు.

09/30/2017 - 01:51

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ‘అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ఎన్నికల హామీ ఏమైందీ సిఎం సారూ..’ అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ నిరుద్యోగ జాక్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ నిరుద్యోగ సంఘాలు, డిఎస్సీ, బి.ఇడి, డిఎడ్ విద్యార్థుల సంఘాల నాయకులు హాజరయ్యారు.

09/30/2017 - 01:50

హైదరాబాద్, సెప్టెంబర్ 29: మెడిసిన్ పిజి కోర్సులో చేరేందుకు నీట్ - పిజిపై అవగాహన కల్పించే సదస్సును డిఎఎంఎస్ నిర్వహించింది. శాటిలైట్ లింకప్ ద్వారా దేశంలో 150 ప్రాంతాల్లో ఉన్న 2500 మంది విద్యార్థులతో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ సమన్వయంతో డిజిటల్ సెమినార్ నిర్వహించింది.

Pages