S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/29/2017 - 22:54

హైదరాబాద్, సెప్టెంబర్ 29: హైదరాబాద్‌లో మరోసారి భారీగా మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. గత కొన్ని రోజులుగా నగరవ్యాప్తంగా డ్రగ్స్‌పై నిఘా పెంచిన ఆబ్కారీ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హైదరాబాద్ నగర శివారులలోని పఠాన్‌చెరు పారిశ్రామిక వాడతోపాటు కూకట్‌పల్లిలో రెండు స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

09/29/2017 - 03:59

వరంగల్, సెప్టెంబర్ 28: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళీ దేవాలయంలో భద్ర కాళి అమ్మవారు గురువారం మహాదుర్గగా భక్తులకు దర్శన మిచ్చా రు. నవరాత్రి ఉత్సవాల ఎనిమిదివ రోజు గురువారం అష్టమి తిథి, మూలనక్షత్రం కావడంతో తెల్లవారుజామున ఆలయంలో నిత్యాహ్నికం జరిపి అమ్మవారిని భద్రకాళి మహాదుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

09/29/2017 - 03:56

నల్లగొండ, సెప్టెంబర్ 28: ముఖ్యమంత్రి కెసిఆర్ నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక కోసం ఉవ్విళ్లూరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలో గెలిచి 2019 ఎన్నికలకు సమరభేరి మోగించేందుకు సిద్ధంగా ఉందని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యు డు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ మున్సిపాల్టీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

09/29/2017 - 03:55

గోదావరిఖని, సెప్టెంబర్ 28: కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారంగా సింగరేణి వారసత్వ ఉద్యోగాలు అమలు చేసేందుకు సిఎం కెసిఆర్ కట్టుబడి ఉన్నారని, అవసరమైతే ప్రత్యేక చట్టాన్నైనా తెచ్చి తీరుతారని ప్రభు త్వ చీఫ్ విప్, సింగరేణి ఆర్జీ-1 ఎన్నికల ఇన్‌చార్జి కొప్పుల ఈశ్వర్, టిబిజికె ఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ హామీ ఇచ్చారు.

09/29/2017 - 03:54

నల్లగొండ, సెప్టెంబర్ 28: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయా ల్లో నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. నల్లగొండ పార్లమెంటు స్థానానికి గుత్తా రాజీనామా చేస్తారని ఆయనకు సిఎం కెసిఆర్ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని కేబినెట్ హోదాతో కట్టబెడతారన్న ప్రచారంతో గుత్తా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు.

09/29/2017 - 03:54

వరంగల్, సెప్టెంబర్ 28: చారిత్రక వరంగల్ నగరంలో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరువాత తెలంగాణలో పెద్ద నగరమైన వరంగల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం అట్టహాసంగా, సంప్రదాయ వాతావరణంలో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళలు తంగేడు, గునుగు, చామంతి, బంతి తదితర పూలతో మొదట గౌరమ్మను, ఆ తరువాత సద్దుల బతుకమ్మను తయారు చేసారు.

09/29/2017 - 03:44

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలని, ఇందుకోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలంగాణ, ఎపి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో గురువారం దుర్గామాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మతం ఏదైనా భగవంతుడు ఒక్కడేనని, వేర్వేరు పేర్లతో భగవంతుడిని పిలస్తుంటామన్నారు.

09/29/2017 - 03:43

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా, ఐటి రంగాల్లో అతివేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ అభివృద్ధిలో మలేషియా ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. మలేషియాకు చెందిన సెలగోర్ ముఖ్యమంత్రి నేతృత్వంలో హైదరాబాద్ వచ్చిన ఉన్నతస్థాయి బృందంతో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ చర్చలు జరిపారు.

09/29/2017 - 03:39

హైదరాబాద్, సెప్టెంబర్ 28: గత పుష్కర కాలంగా వరుసగా నిర్వహిస్తున్న అలయ్ భలయ్ కార్యక్రమాన్ని ఈ ఏడాది అక్టోబర్ 1న నిర్వహించనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.

09/29/2017 - 01:59

హైదరాబాద్, సెప్టెంబర్ 28: అక్టోబర్ 21న జరిగే పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే 2వ, ఇండియన్ పోలీస్ మార్టిర్స్ మెమోరియల్ రన్ (ఐపిఎంఎంఆర్)కు తన పూర్తి సహకారం ఉంటుందని, అమర పోలీస్ రన్ ఎప్పుడు నిర్వహించినా తాను అందుబాటులో ఉంటానని భారత మహిళా క్రికెట్ టీం కెప్పెన్ మిథాలి రాజ్ అన్నారు.

Pages