S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/25/2017 - 02:05

చిత్రాలు..తెలంగాణ భవన్‌లో ఆదివారం బంగారు బతుకమ్మను ప్రారంభిస్తున్న అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కవిత. అనంతరం బతుకమ్మ ఆడుతున్న కవిత తదితరులు

09/25/2017 - 02:04

హైదరాబాద్, సెప్టెంబర్ 24: మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌లో ఇప్పుడు ఉన్న సౌకర్యాలకు అదనంగా మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. జాతీయ స్థాయిలో చేపట్టిన ‘స్వచ్ఛత హై సేవ’ కార్యక్రమంలో భాగంగా జిఎం ఆదివారం మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌లో శ్రమదానం నిర్వహించారు.

09/25/2017 - 02:00

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

09/25/2017 - 01:53

హైదరాబాద్, సెప్టెంబర్ 24: సింగరేణి కార్మికులెవరూ టిఆర్‌ఎస్‌ను నమ్మొద్దని, ఆ పార్టీ సంస్థను అమ్మేస్తుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టినట్లుగానే ఇప్పుడు సింగరేణి కార్మికుల తలలకు వెలకడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

09/25/2017 - 01:52

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాలనలో బడుగుల వరుస బలవన్మరణాలు కొనసాగుతున్నాయని టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఇందుకు మానకొండూరు నియోజకవర్గంలో దళితుడు మాంకాళి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన టిఆర్‌ఎస్ నేత, మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్ మృతే నిదర్శనమని అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

09/25/2017 - 01:52

హైదరాబాద్, సెప్టెంబర్ 24: గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆరో గ్య పరీక్షలు నిర్వహించాలని ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నోజు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భోధన విధానానికి ఏడాదికి ఆరుసార్లు పరీక్షిస్తున్న ప్రభుత్వం ఆరోగ్యం విషయంలో ఎందుకు పరీక్షించడం లేదని ప్రశ్నించారు.

09/25/2017 - 01:51

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని సికిందరాబాద్‌లోని బైసన్ పొలో గ్రౌండ్‌కు మార్చాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆలోచనపై ప్రజాభిప్రాయ సేకరణకు ఈ నెల 26న నగరంలో 20 బ్యాలెట్ బాక్సులు పెడుతున్నట్లు ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు తెలిపారు.

09/25/2017 - 00:27

హైదరాబాద్, సెప్టెంబర్ 24: బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అక్టోబర్ 1న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘అలయ్-బలయ్’ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 13 ఏళ్ళుగా దసరా పండుగ మర్నాడు అలయ్-బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు.

09/25/2017 - 00:25

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ జైళ్లశాఖ జైళ్లలో పటిష్ఠ భద్రతకు చర్యలు చేపట్టింది. 4 కోట్ల వ్యయంతో కేంద్ర కారాగారాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి జైలులో 150 సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశారు. ఐసిస్ ఉగ్రవాద ఖైదీలపై గట్టి నిఘా వేసి.. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలతో పర్యవేక్షణ చర్యలు చేపట్టారు.

09/25/2017 - 00:23

హైదరాబాద్, సెప్టెంబర్ 24: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో మూడెకరాల భూమికోసం తీవ్రంగా పోరాడి బలవన్మరణం పొందిన మాంకాళి శ్రీనివాస్ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని టిటిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 25న కరీంనగర్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Pages