S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/22/2017 - 02:18

హైదరాబాద్, సెప్టెంబర్ 21 రైల్వేల భద్రతే లక్ష్యంగా ధైర్య సాహసాలు, సంకల్ప శక్తి, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షణ దళం కృషి ప్రశంసనీయమని దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ అన్నారు. గురువారం రైల్వే రక్షక దళం 33వ, వ్యవస్థాపక దినోత్స వేడుకను ఆయన ప్రారంభించారు. జాన్ థామస్ మాట్లాడుతూ, రైళ్లలో ప్రయాణికులకు భద్రత కల్పిస్తూ, శాంతిభద్రతలు పరిరక్షిస్తామని ఆయన తెలిపారు.

09/22/2017 - 02:18

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం టనె్నల్ పనుల్లో పై కప్పు నుంచి బండరాళ్లు పడి ఏడుగురు కార్మికులు చనిపోయిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

09/22/2017 - 02:17

హైదరాబాద్, సెప్టెంబర్ 21: టీచర్ల సర్వీసు నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయి పాఠశాలల పర్యవేక్షణ గతి తప్పింది. ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సంబంధించిన పోరు గత 15 సంవత్సరాలుగా కొనసాగుతోంది.

09/22/2017 - 02:17

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్రప్రభుత్వం గత మూడేళ్లలో ఏం సాధించిందో ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని బిజెపి గురువారం నాడు డిమాండ్ చేసింది. శాసనమండలి బిజెపి పక్ష నేత ఎన్ రామచందర్‌రావు పాత్రికేయులతో మాట్లాడుతూ కాళేశ్వరం ఘటనపై విచారణ జరిపించాలని, అలాగే నాసిరకం చీరల కుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

09/22/2017 - 02:13

హైదరాబాద్, సెప్టెంబర్ 21: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని (టిబిజికెఎస్) గెలిపించి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కానుకగా అందిస్తామని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో గురువారం ఈ సంఘం నేతలు టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపి కవిత, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్‌ను కలిసి ప్రకటించారు.

09/22/2017 - 02:11

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కంచె ఐలయ్యపై కేసులు నమోదై ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గురువారం హోంమంత్రి నాయిని మీడియాతో మాట్లాడుతూ, బతుకమ్మ చీరల వివాదంపై ఆయన స్పందించారు.

09/21/2017 - 23:27

హైదరాబాద్, సెప్టెంబర్ 21: మిషన్ భగీరథ పనులు పూర్తయిన అన్ని ప్రాంతాలకు ఈ నెల చివరి నుండి తాగునీటిని సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ సురేందర్ రెడ్డి ఆదేశించారు.

09/21/2017 - 23:26

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్ర పండుగగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని (ఈ నెల 27న) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేరుతో గురువారం జీఓ జారీ అంది.

09/21/2017 - 23:25

హైదరాబాద్, సెప్టెంబర్ 21: దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టిఎస్‌ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. స్కూళ్లకు, కాలేజీలకు దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.

09/21/2017 - 22:13

కాళేశ్వరం పనుల్లో జరిగిన ప్రమాదంలో 7 మంది మృతి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు సమీక్షించిన మర్నాడే ఘటన జరిగిందని పొన్నం బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Pages