S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/03/2017 - 00:17

హైదరాబాద్, సెప్టెంబర్ 2: రాజధాని నగరంలో వౌలిక వసతుల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఇప్పుడున్న ఇంజనీరింగ్ సిబ్బందికి అదనంగా మరో 300 మంది ఇంజనీర్ల సేవలు ఉపయోగించుకోనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగర స్థాయికి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో పని చేస్తోందని తెలిపారు.

09/02/2017 - 02:57

గద్వాల, సెప్టెంబర్ 1: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటి ఉధృతితో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జెన్‌కో అధికారులు 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నారు.

09/02/2017 - 02:55

సుల్తానాబాద్, సెప్టెంబర్ 1: అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతాంగం ఇకనుండి భరోసాతో బతికేందుకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతురాజుపల్లి గ్రామంలో సర్పంచ్ కల్వల లావణ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు మంత్రి శ్రీకారం చుట్టారు.

09/02/2017 - 02:59

సూర్యాపేట, సెప్టెంబర్ 1: సమైక్య పాలనలో తెలంగాణలోని వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురై రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయందని, ఇలాంటి పరిస్థితుల నుంచి రైతాంగాన్ని గట్టెక్కించి వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చే లక్ష్యంతో సిఎం కెసిఆర్ ఏర్పాటు చేస్తున్న గ్రామ రైతు సమితులు ప్రపంచానికే ఆదర్శంగా నిలవనున్నాయని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

09/02/2017 - 02:52

కోనరావుపేట, సెప్టెంబర్ 1: కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి శనివారం వస్తున్న మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు పర్యటనకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్టు వేములవాడ డిఎస్పీ ఎ.చంద్రశేఖర్ వెల్లడించారు. శుక్రవారం నాగారంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నలుగురు సిఐలు, 12 మంది ఎస్సైలు, 250 మంది పోలీసు అధికారులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

09/02/2017 - 02:51

సిరిసిల్ల, సెప్టెంబర్ 1: సిరిసిల్లలో సంక్షోభంలో ఉన్న చిన్న తరహా డైయింగ్ పరిశ్రమను ఆధునీకరించి కార్మికుల జీవనోపాధిని కాపాడాలని సిరిసిల్ల పవర్‌లూం గుడ్డల అద్దకం పరిశ్రమల యజమానులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వీరు వినతి పత్రం సమర్పించారు.

09/02/2017 - 02:47

హైదరాబాద్, సెప్టెంబర్ 1: మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసిఈఎంఈ) కమాండెంట్‌గా లెఫ్టనెంట్ జనరల్ పరంజీత్ సింగ్ శుక్రవారం సికింద్రాబాద్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో పని చేస్తున్న లెఫ్టనెంట్ జనరల్ కెకె అగర్వాల్ ఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం డైరక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.

09/02/2017 - 02:45

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ఎక్కువ మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులు ప్రతిభా పారితోషికం కోసం ఈ నెల 10వ తేదీలోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణా చారి తెలిపారు.

09/02/2017 - 02:44

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ విమోచన యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, రజాకర్ల వారసత్వంతో పుట్టిన ఎంఐఎం పార్టీ కబంధ హస్తాలలో చిక్కుకున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విముక్తి చేయడానికి నిర్వహిస్తున్న యాత్రకు అంతా కలిసి రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం గద్దె దిగేరోజు దగ్గరపడిందని అన్నారు.

09/02/2017 - 02:39

చిత్రం..శాసనసభ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వేదాంతం నరసింహాచార్యులు
శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన దృశ్యం.

Pages