S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/01/2017 - 03:29

నల్లగొండ, ఆగస్టు 31: దసరా నాటికి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన ఆలయం నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు గర్భాలయంలో స్వామివారి దర్శనాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ అంచనా మేరకు నిర్మాణ పనులు వేగంగా సాగకపోవడంతో భక్తులకు మరికొంతకాలం బాలాలయంలోనే స్వామివారి దర్శనాలు కొనసాగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

09/01/2017 - 03:27

బాసర, ఆగస్టు 31: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం నుండి అమ్మవారి విగ్రహం తరలింపు, అక్షరాభ్యాస పూజల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ గురువారం బాసర ఆలయంలో విచారణ ప్రారంభించింది.

09/01/2017 - 03:26

వేములపల్లి, ఆగస్టు 31: బీరు సీసాల లోడ్‌తో వెళ్తున్న డిసిఎం వ్యాన్ బోల్తాపడింది. ఈ సంఘటన గురువారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ నుండి హుజూర్‌నగర్‌కు 345 బీరు కాటన్లను లోడ్ చేసుకోని శెట్టిపాలెం సమీపంలోని మూలమలుపు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా బోల్తాపడింది. డిసిఎం వ్యాన్ అతివేగంగా వెళ్తుండడంతో బోల్తాపడింది.

09/01/2017 - 03:22

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ రాష్ట్రానికి నాబార్డు 8 వేల కోట్ల రూపాయిల రుణాన్ని అందించినట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2022 వరకూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో నాబార్డు పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు.

09/01/2017 - 03:15

హైదరాబాద్, ఆగస్టు 31:ఎంసిఐ నిబంధనల ప్రకారం ఇక వైద్యులు, సిబ్బంది తప్పని సరిగా సమయపాలన పాటించాలని, బయో మెట్రిక్ విధానం అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. నిర్ణీత సమయాల్లో వైద్య శాలల్లో లేని వారిపై చర్యలు తీసుకుంటామని, దానికి వారిదే బాధ్యత అని మంత్రి హెచ్చరించారు. గురువారం తన చాంబర్‌లో వైద్య శాఖపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్షించారు.

09/01/2017 - 03:14

హైదరాబాద్, ఆగస్టు 31: రాష్ట్రంలో పంటల ధరల నియంత్రణకు 500 కోట్ల రూపాయలను మూలనిధిగా కేటాయిస్తున్నామని, ఈ నిధులు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధీనంలో ఉంటాయని సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డివిజనల్, మండల వ్యవసాయ అధికారుల శిక్షణా కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు.

09/01/2017 - 03:12

హైదరాబాద్, ఆగస్టు 31: ప్రత్యేకంగా డిఫెన్స్ రంగం కోసం స్టార్టప్ ఇంక్యుబెటర్‌ను ప్రారంభించనున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ సైంటిఫిక్ అడ్వయిజర్‌తో ఈ అంశంపై అనేక సార్లు చర్చించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.

09/01/2017 - 02:44

హైదరాబాద్, ఆగస్టు 31: మిషన్ భగీరథతో తెలంగాణ చరిత్ర సృష్టిస్తుందని మధ్యప్రదేశ్ తాగునీటి శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా భగీరథ పనులు జరుగుతున్నాయని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరు దగ్గర నిర్మిస్తున్న ఇన్‌టేక్ వెల్, హెడ్ వర్క్స్ పనులను మధ్యప్రదేశ్ తాగునీటి శాఖాధికారులు పరిశీలించారు.

09/01/2017 - 02:37

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పని చేస్తున్న ఇంజినీర్లు మెరుపుసమ్మెకు దిగారు. గతంలో తమకు ఇచ్చిన పదోన్నతులను రద్దు చేస్తూ డిస్కమ్ జారీ చేసిన ఉత్తర్వులకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత డిస్కమ్ సిఎండి కార్యాలయం వద్ద ఈ నిరాహార దీక్ష చేపట్టారు.

09/01/2017 - 02:35

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టిటిడిపి) జిల్లా అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుల నియామాకానికి ఆమోదం తెలిపారు. పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

Pages