S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/01/2017 - 02:34

హైదరాబాద్, ఆగస్టు 31: వరంగల్ డిసిసి అధ్యక్షుడు ఎన్ రాజేందర్ రెడ్డికి కార్పోరేటర్ మురళి హత్య కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సునీల్ చౌదరి బెయిల్ మంజూరు చేశారు.
నేడు కోర్టు విధులు బహిష్కరిస్తాం: న్యాయవాదులు

09/01/2017 - 02:33

హైదరాబాద్, ఆగస్టు 31: జాతీయ పతాకాన్ని అవమానించిన కేసులో సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో దిగువ కోర్టులో అరవింద్‌పై ఉన్న కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర రావు కొట్టివేస్తూ ఆదేశాలు జారీచేశారు. జాతీయపతాకాన్ని అవమానించాలన్న ఉద్దేశ్యం లేదని అరవింద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం కోర్టు పై నిర్ణయం తీసుకుంది.

09/01/2017 - 02:32

హైదరాబాద్, ఆగస్టు 31: ఓ మహిళను తనతో స్నేహం చేయాలంటూ మెస్సేజ్‌లు పంపుతూ, వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని షీ టీమ్స్ బృందం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఫ్రెండ్‌షిప్ డే నాడు తాను పనిచేస్తున్న కార్యాలయానికి ఆ యువకుడు వచ్చి తోటి సిబ్బంది ముందు అవమానపరిచాడని, ఫేస్‌బుక్‌లో అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతున్నాడంటూ, ఆ యువతి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది.

09/01/2017 - 02:31

హైదరాబాద్, ఆగస్టు 31: మహత్తరంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి తరానికి వివరించేందుకు సెప్టెంబర్ 11నుంచి 17వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో సాయుధ పోరాట ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

09/01/2017 - 02:31

హైదరాబాద్, ఆగస్టు 31: రైళ్లలో అక్రమ రవాణాపై పోలీసులు దృష్టిసారించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు, డిజిపి (రైల్వే భద్రత) కృష్ణప్రసాద్ గురువారం సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైల్వే స్టేషన్లో భద్రతా సిబ్బంది, అధికారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

08/31/2017 - 23:21

హైదరాబాద్, ఆగస్టు 31: వివిధ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడటంపై మానవ హక్కుల కమిషన్ గురువారం నాడు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆత్మహత్యలకు కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్యకు నోటీసులు జారీ చేసింది.

08/31/2017 - 23:20

హైదరాబాద్, ఆగస్టు 31 : రాష్ట్రంలో అతి పెద్ద కేంద్రీకృత వంట కేంద్రాన్ని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం నాడు ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని అక్షయ పాత్ర సంస్థ నిర్వహించనుంది. కోకాపేట నార్సింగి గ్రామంలో శ్రీకృష్ణ గో సేవామండలి కేంద్రంలో ఈ కేంద్రీకృత వంట కేంద్రం ఏర్పాటు చేశారు.

08/31/2017 - 23:20

న్యూఢిల్లీ,ఆగస్టు 31: భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని ఎంపి బూర నర్సయ్యగౌడ్ కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖమంత్రి జెపి నడ్డాని కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం ఎయిమ్స్ నిధుల విడుదలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

08/31/2017 - 23:19

హైదరాబాద్, ఆగస్టు 31: నాటి నిజాం దురాగతాలకు, రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల గాథలను గుర్తుచేసుకుంటూ అందుకు సాక్షీభూతంగా నిలిచిన ప్రాంతాలను సందర్శిస్తూ మరో పక్క రాష్ట్రప్రభుత్వ మాటల గారడీని ఎండగడుతూ బిజెపి తెలంగాణ విమోచన యాత్ర శుక్రవారం నాడు ప్రారంభం కానుంది. ఏడు రోజుల పాటు 20 జిల్లాల్లో 36 నియోజకవర్గాల పరిధిలోని 105మండలాల్లో సాగుతుంది.

08/31/2017 - 23:18

హైదరాబాద్, ఆగస్టు 31: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామగుండం, మందమర్రి ఏరియాల్లో ఒక్కొక్కటి 50మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ తెలిపారు. గురువారం నాడిక్కడ సింగరేణి భవన్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Pages