S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/31/2017 - 23:17

హైదరాబాద్, ఆగస్టు 31: రాష్ట్రంలో పనిచేస్తున్న వ్యవసాయ సిబ్బంది సమస్యలను తీరుస్తామని సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ అధికారులకోసం గురువారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం సందర్భంగా పలువురు అధికారులు మంత్రిదృష్టికి వివిధ సమస్యలు తీసుకువచ్చారు.

08/31/2017 - 23:16

హైదరాబాద్, ఆగస్టు 31:ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణం చేసుకోలేక పోతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. వారం పది రోజుల నుంచి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరి కొందరు అవార్డు ఇచ్చిన సంస్థను మేమే సృష్టించుకున్నాము అన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

08/31/2017 - 02:21

తాండూరు: తాండూరు కార్యకర్తల సమావేశంలో ఘోరం జరిగింది. అధికార టిఆర్‌ఎస్‌కు చెందిన మైనార్టీ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంత్రి సమక్షంలోనే పార్టీలో తనకు ప్రాతినిధ్యం లేదంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే..

08/31/2017 - 02:20

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన వివిధ సాగునీటి, వౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వస్తుసేవాపన్ను(జిఎస్‌టి) భారాన్ని ఐదు శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ను బలంగా వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జిఎస్‌టిని 18నుంచి 12శాతానికి తగ్గించడం వల్ల ఉపయోగం లేదని, ఐదు శాతానికి తగ్గించాలని తెలంగాణతో సహా దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.

08/31/2017 - 02:20

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో నగరశివారులోని వౌలాలి వద్ద రైల్‌రోకో నిర్వహించిన కేసులో సికిందరాబాద్ రైల్వే కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నాయిని నర్సింహారెడ్డి, టి పద్మారావు సహా 14 మందిపై నమోదైన కేసును రైల్వే కోర్టు కొట్టివేసింది. 2011లో రైల్‌రోకో నిర్వహించి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారన్న అభియోగంపై వీరిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

08/31/2017 - 02:20

హైదరాబాద్: వైద్య కళాశాల సీట్ల భర్తీలో రిజర్వేషన్లకు సంబంధించిన జివో నెంబర్ 550లోని క్లాజ్ 5(2)ను హైకోర్టు బుధవారం కొట్టి వేసింది. 2001జూలైలో అప్పటి ఏపి ప్రభుత్వం జారీ చేసిన జివో ఆర్‌టి నెంబర్ 550ని సవాల్ చేస్తూ హర్షవర్ధన్ తదితరులు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రమణియన్, జస్టిస్ రజనీతో కూడిన డివిజన్ బెంచ్ ఇరుపక్షాల వాదనలు విని ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది.

08/31/2017 - 02:19

హైదరాబాద్: దేశంలో మొదటిసారిగా ఇంటర్నేషనల్ లా పై అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 3వ తేదీ నుండి నిర్వహించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుండి ప్రసిద్ధి గాంచిన 60 మంది ఉన్నత స్థాయి న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరుకానున్నారు.

08/30/2017 - 03:28

హైదరాబాద్, ఆగస్టు 29: కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణం కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. మొత్తం 26 జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచినట్టు, 26 జిల్లాలకు ఒప్పందాలు పూర్తయినట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

08/30/2017 - 03:25

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణలోని మిషన్ భగీరథ తరహాలో మధ్యప్రదేశ్‌లో కూడా ప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. మిషన్ భగీరథ ఖరీదైన ప్రాజెక్టు కాదు, అద్భుతమైన ప్రాజెక్టు అని మధ్యప్రదేశ్ తాగునీటి శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ అశీష్ కుమార్ శ్రీవాత్సవ అన్నారు. ప్రజారోగ్యం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసినా తక్కువేనని చెప్పారు.

08/30/2017 - 03:21

హైదరాబాద్, ఆగస్టు29: సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’ (టిఎస్‌బిఎస్‌పి) అనుకున్న లక్ష్యాల దిశగా పదిచేస్తోందని చైర్మన్ కెవి రమణాచారి తెలిపారు. ఆంధ్రభూమితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఆర్నెల్ల కాలంలో పరిషత్ చేపట్టిన కార్యక్రమాలను, పేద బ్రాహ్మణులకు అందించిన ఆర్థిక సేవల్ని వివరించారు.

Pages