S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/30/2017 - 03:19

హైదరాబాద్, ఆగస్టు 29: ఒకటి రెండు ఆస్తులకు సంబంధించి అంశాలు తప్పితే ఆర్టీసిలో విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎక్కడ ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రంలోని ఆర్టీసికే చెందుతాయని చెప్పారు. సచివాలయంలో మంత్రి అధికారులతో ఆర్టీసిపై మంగళవారం సమీక్షించారు. మరో 1500 కొత్త బస్సులను హైదరాబాద్ నగరం కోసం ముఖ్యమంత్రిని కోరనున్నట్టు చెప్పారు.

08/30/2017 - 03:16

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఆగస్టు 29: దేశంలోని బాలబలికలను స్వేచ్చవైపు నడిపించడమే లక్ష్యంగా కోటి మందితో భారత్ యాత్రకు శ్రీకారం చుట్టినట్టు నోబల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్ధి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లోఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యాత్ర వివరాలను వెల్లడించారు. బాల,బాలికలపై లైంగిక వేదింపులు, చిన్నారుల అక్రమ రవాణపై యుద్దం ప్రకటిస్తున్నట్టు చెప్పారు.

08/30/2017 - 03:13

హైదరాబాద్, ఆగస్టు 29: కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచినీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సింగూరు నుంచి హైదరాబాద్‌కు, అక్కంపల్లి నుంచి నల్లగొండ జిల్లాకు మంగళవారం రాత్రి నుంచే నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

08/30/2017 - 02:29

హైదరాబాద్, ఆగస్టు 29: వివిధ కారణాలతో తమ పార్టీని వీడిన ముఖ్య నాయకులంతా వెనక్కి రానున్నారని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. మంగళవారం భట్టివిక్రమార్క విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు. పార్టీని వీడిన నాయకుల్లో కొందరు వెనక్కి వస్తామన్న సంకేతాలు పంపించారని, మరి కొందరు తమతో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు.

08/30/2017 - 02:27

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంవత్సరం మొదలై రెండు నెలల వ్యవధిలోనే అపుడే దాదాపు పది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడటంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

08/30/2017 - 02:26

హైదరాబాద్, ఆగస్టు 29: టిఆర్‌ఎస్ నేతలతో రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెంబర్ 39పై కోర్టుకు వెళ్ళనున్నట్లు టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. చట్ట వ్యతిరేకమైన జివో నెంబర్ 39ని వెంటనే రద్దు చేయాలని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

08/30/2017 - 02:26

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయిందని టిఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల పాపం టిడిపిదని, ముదిగొండ కాల్పుల పాపం కాంగ్రెస్‌దని ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

08/30/2017 - 02:25

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ విమోచనకు జరిగిన పోరు, దాని వెనుక తెలంగాణ పోరాట యోధుల కృషి , దాని ప్రాధాన్యతను ప్రజల్లో మరింత చర్చకు పెట్టి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా బిజెపి రోజురోజుకూ ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి తెలంగాణ విమోచన యాత్రకు రూపకల్పన చేసింది.

08/30/2017 - 02:24

హైదరాబాద్, ఆగస్టు 29: బ్యాంక్ రుణం కోసం గ్యారంటీ లెటర్ ఇస్తామంటూ ఓ కంపెనీ యాజమాన్యాన్ని మోసగించి ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని మిసెస్ క్యోరి ఒరెమిన్ లిమిటెడ్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డికి హర్యానాలోని గుర్‌గావ్ చెందిన గోవింద్ యశ్వంత్, సంజీవ్ కొఠారి పరిచయమయ్యారు.

08/30/2017 - 02:23

హైదరాబాద్, ఆగస్టు 29: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ అడ్మిషన్ల నిబంధనలను సడలించినట్టు దోస్త్ కన్వీనర్ డాక్టర్ లింబాద్రి తెలిపారు. దోస్త్ చివరి దశ అడ్మిషన్లకు మంగళవారం వరకూ అవకాశం ఇచ్చామని అన్నారు.

Pages