S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/29/2017 - 02:48

మహేశ్వరం, ఆగస్టు 28: రంగారెడ్డి జిల్లాను కూరగాయల హబ్‌గా ప్రకటించి విమానాల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్.. రైతులు పండించిన కూరగాయలను కనీసం నగరానికి తరలించడానికి బస్సు సౌకర్యం కూడా కల్పించడం లేదని బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు.

08/29/2017 - 02:45

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో పాల్గొన్న పలువురు రాష్ట్ర మంత్రులు సోమవారం సికిందరాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. నగరశివారులోని వౌలాలీ రైల్‌రోకో కేసులో ఇప్పటికే మంత్రులు పలుసార్లు కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే.

08/29/2017 - 02:05

తెలంగాణ లెజిస్లేచర్ అసెంబ్లీ మీడియా సలహా కమిటీ తొలి సమావేశం శాసనమండలి చైర్మన్
స్వామిగౌడ్ అధ్యక్షతన సోమవారం జరిగింది. మీడియా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి శాసనసభ కార్యదర్శి డాక్టర్ రాజాసదారామ్ వివరించారు.

08/29/2017 - 02:02

హైదరాబాద్, ఆగస్టు 28: రబీ సీజన్‌లో వేర్వేరు పంటలబీమాకు సంబంధించి ప్రీమియం గడువును ఉన్నతస్థాయి కమిటీ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి నేతృత్వంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పంటల బీమాపై సచివాలయంలో సోమవారం జరిగిన రాష్టస్థ్రాయి సమన్వయ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

08/29/2017 - 02:01

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జల్ నిగమ్ మర్యాదిత్ శాక ఇంజనీర్ల బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించి, మిషన్ భగరీథ పనులు పరిశీలిస్తారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్టల్రు తమ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపించాయి.

08/29/2017 - 02:00

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రజలను మభ్యపెట్టడంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సు ఇవ్వొచ్చని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావుఎద్దేవా చేశారు. గత రెండు రోజుల నుండి ముఖ్యమంత్రి భూ సర్వేపై పెద్ద ఎత్తున సమీక్షిస్తున్నారని, వాస్తవానికి సర్వే అనేది ఒక పెద్ద ఫార్సు అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు.

08/29/2017 - 02:00

హైదరాబాద్, ఆగస్టు 28: గిరిజన సంక్షేమ పథకాలు, పథకాల అమలుపై పరిశోధన, వినూత్న కార్యక్రమాలు అనే అంశంపై జాతీయ సదస్సును వర్శిటీ ఆడిటోరియం హాలులో ఈ నెల 29 నుండి నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి అప్పారావు సోమవారం నాడు చెప్పారు.

08/29/2017 - 01:59

హైదరాబాద్, ఆగస్టు 28: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయ అభద్రతలో ఉన్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించిన పాలకులకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

08/29/2017 - 01:58

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించారు.గృహనిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించారు.

08/29/2017 - 01:58

హైదరాబాద్, ఆగస్టు 28: బిఇడి కోర్సులో చేరేందుకు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను ఈ నెల 30వ తేదీన జారీ చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. సర్ట్ఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 7 నుంచి 13 వరకూ జరుగుతుందని, వెబ్ ఆప్షన్లను 9వ తేదీ నుండి 16వ తేదీ వరకూ నమోదు చేసుకోవచ్చని అన్నారు.

Pages