S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/28/2017 - 23:35

హైదరాబాద్, ఆగస్టు 28: రాష్ట్రంలో త్వరలోనే మూడు వందల అంగన్‌వాడి భవనాలను నిర్మించనున్నట్టు రోడ్లు భవనాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని అంగన్‌వాడి కేంద్రాలు అన్నింటికీ సెప్టెంబర్ నుంచి చౌక ధరల దుకాణాల నుంచే రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న స్టాక్ పాయింట్ నుంచి పిల్లలకు అందించే బియ్యం రవాణా అవుతోంది.

08/28/2017 - 23:35

హైదరాబాద్, ఆగస్టు 28: ‘అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ (తెలంగాణ అగైనస్ట్ కరప్షన్ టిఏసి)’ పేరుతో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు కాబోతోంది.

08/28/2017 - 03:12

సూర్యాపేట, ఆగస్టు 27: తెలంగాణ అంటేనే పాటలు...సంస్కృతి...సంప్రదాయాలని, నాటి సాయుధ పోరాటం నుంచిమొదలుకొని మొన్నటి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ఈ ప్రాంతం లో పాటలు, కళాకారులే స్ఫూర్తినిచ్చారని విద్యుత్ శాఖ మంత్రి అన్నారు. భాష సంస్కృతికశాఖ, సాంస్కృతిక సారథి, తెలంగాణ జానపద కళాకారుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జిల్లాకేంద్రంలో జిల్లా స్థాయి జానపద జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు.

08/28/2017 - 03:10

చిట్యాల, ఆగస్టు 27: ఆశ్రమం కోసం భూములను కొనుగోలు చేసిన డేరా సచ్చా సౌదా సంస్థకు సంబంధించిన భూముల్లో అసైన్డ్ భూములు కూడా కొనుగోలు చేశారని, వాటిని చట్ట ప్రకారం వెనక్కి తీసుకుంటామని నల్లగొండ ఆర్‌డివో ఇ. వెంకటాచారి తెలిపారు.

08/28/2017 - 03:08

మిర్యాలగూడ, ఆగస్టు 27: ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేరు. ఏమైందో ఏ కష్టం వచ్చిందో తెలియదు. ఇద్దరు కలిసే తనువు చాలించారు. బాబుసాయిపేట గ్రామానికి చెందిన బచ్చు చరణ్ (19), బూరుగు నాగరాజు(20) నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ సమీపంలోని టీక్యాతండా వద్ద రైలు పట్టాలపై శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు.

08/28/2017 - 03:07

నారాయణపేటటౌన్, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభు త్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు చేపడుతోందని, గత మూడేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏమి సాధించిందో వివరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో లోపాయికారి ఒప్పందంతో ముందు కు సాగుతూ పాలన సాగిస్తున్నాయని, నిజమైన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఆయ న అన్నారు.

08/28/2017 - 03:05

గోదావరిఖని, ఆగస్టు 27: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో అరుకోళ్ల శ్రీనివాస్ అలియాస్ బుగ్గల శ్రీను అనే విలేఖరి దారుణ హత్యకు గురయ్యా డు. స్థానిక ఉదయ్ నగర్‌లోని తన ఇంట్లో విచక్షణారహితంగా దుండగులు కత్తులతో దాడి చేసి అతనిని హతమార్చారు. అడొచ్చిన శ్రీను భార్య అంజలిపైన కూడా దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆమె కూడా గాయపడింది.

08/28/2017 - 03:04

కరీంనగర్, ఆగస్టు 27: ‘ఊరికే కాంగ్రెస్‌పై నిందలు వేయడం కాదు.. మీకు నిజాయితీ, దమ్ము, ధైర్యముంటే 2014 కంటే ముందు, ఆ తరువాత రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అంటూ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ టిఆర్‌ఎస్ మంత్రులు, నాయకులకు సవాల్ విసిరారు. ‘మీరో ఐదుగురు ఇంజనీర్లను తెచ్చుకోండి, మేము ఐదుగురిని తెచ్చుకుంటాం, ఎవరెన్ని ప్రాజెక్టులు చేపట్టారో తేల్చుకుందాం..

08/28/2017 - 02:37

హైదరాబాద్, ఆగస్టు 27: కొద్దిపాటి చినుకులు పడితే చాలు.. రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. వా న దంచి కొడితే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. గతంలో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగేవి. ఇప్పుడు అపార్టుమెంట్ల సెల్లార్లూ నీట మునుగుతున్నాయి, లోపల ఉండే వాహనాలు తేలియాడుతున్నాయి. ఇది ఏ ఒక్క రోజో లేక ఒక ఏడాదో కాదు, సంవత్సరాల తరబడి కొనసాగుతున్నది.

08/28/2017 - 02:32

హైదరాబాద్, ఆగస్టు 27: దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాణాంతకమైన డ్రగ్స్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. అత్యధికంగా మహరాష్టల్రో మాదకద్రవ్యాల మరణాలు సంభవిస్తుండగా, ఐదో స్థానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి)లో వెల్లడైంది.

Pages