S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/19/2017 - 04:04

గంగాధర, ఆగస్టు 18: కరీంనగర్ జిల్ల్లా గంగాధర మండలంలోని గర్శకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులపై తేనెటీగలు దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లకు తేనెతెట్టెలు ఉండగా, మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన విద్యార్థులపై తేనెటీగలు గుంపు లేచి దాడి చేయడంతో 17 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

08/19/2017 - 03:39

హైదరాబాద్, ఆగస్టు 18: ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశీ విద్య అందించేందుకు ప్రారంభించిన పథకం అసలు లక్ష్యం నెరవేరకుండా నిబంధనల పేరుతో తూట్లు పొడుస్నురు. బిసి విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా పూలే విద్యా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

08/19/2017 - 03:37

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఆగస్టు 18: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం అమీర్‌పేటలోని మ్యారీగోల్డ్ హోటల్‌లో నిర్వహించిన ‘ది ప్రిన్సిపల్స్ కాన్‌క్లేవ్ -2017’కు ఆయన ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. నగరంలో డ్రగ్స్ రాకెట్ ఈ స్థాయిలో విస్తరించడం ఆవేదన కలిగించే అంశం అన్నారు.

08/19/2017 - 03:34

హైదరాబాద్, ఆగస్టు 18: వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను ప్రధాని నరేంద్రమోదీ 42 శాతం పెంచారని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ పెంపు జనవరి 19వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని అయితే ఆ రోజు నుండి కనీస వేతనాల పెంపును సింగరేణి సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కూడా అమలుచేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.

08/19/2017 - 03:33

హైదరాబాద్, ఆగస్టు 18: జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తున్నారని అన్నారు. వంద కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్టు, దేశంలో ఇలా ఎక్కడా జరగలేదని అన్నారు.

08/19/2017 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన అంబేద్కర్ విగ్రహ స్థాపన దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చి దిద్దాలని రాష్ట్ర విద్యుత్, ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ డ్రీమ్ ప్రాజెక్టు అని వివరించారు.

08/19/2017 - 03:02

హైదరాబాద్, ఆగస్టు 18: పరిశోధనల కోసం హైదరాబాద్ కేంద్రంగా గగనంలోకి 10 బెలూన్లను వదలిపెట్టనున్న టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ విభాగం, భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు ఒకటి నుంచి 30 వరకు గగనంలోకి వదలనున్న ఈ బెలూన్లలో హైడ్రోజిన్ గ్యాస్ నింపినట్టు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సైంటిస్ట్ ఇన్ ఇన్‌చార్జి బి సునీల్ పేర్కొన్నారు.

08/19/2017 - 03:01

హైదరాబాద్, ఆగస్టు 18: సింగరేణి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసగించిందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికుల ఓట్ల కోసం టిఆర్‌ఎస్ సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఆయన విమర్శించారు.

08/19/2017 - 02:59

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణలో డిప్యుటీ సర్వేయర్ పోస్టుల ఎంపికకు ఈ నెల 20వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి ఎ వాణి ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే అభ్యర్ధులకు హాల్‌టిక్కెట్లను పంపించామని, కమిషన్ వెబ్ పోర్టల్ నుండి కూడా అభ్యర్ధులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

08/19/2017 - 02:59

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లో ఆరు నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 27 నుంచి ఆరు నెలల పాటు ఈ నిషేధపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
రిజిష్ట్రేషన్లు, స్టాంప్‌ల శాఖ
అదనపు ఐజిగా వెంకట రాజేశ్

Pages