S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/19/2017 - 02:58

హైదరాబాద్, ఆగస్టు 18: ఉద్యోగాల ఖాళీలపై శే్వతపత్రం విడుదల చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పదేళ్ళలో ఉద్యోగుల పదవీ విరమణ వల్ల ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిలో ఎన్నింటిని భర్తీ చేశారని ఆయన ప్రశ్నించారు.

08/19/2017 - 03:03

హైదరాబాద్, ఆగస్టు 18: దేశం నుంచి బయటకు వెళ్లిన లక్షల కోట్ల నల్లధనం వెలికితీసి, తిరిగి దేశానికి రప్పించి ప్రజలందరికీ పంపిణీ చేస్తానన్న ప్రధాని మోదీ ఇప్పుడు ఎందుకు వౌనం వహిస్తున్నారని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. నల్లధనం దేశానికి తెస్తున్నారా..? లేక దేశం దాటిస్తున్నారా..? అని నిలదీశారు.

08/19/2017 - 01:53

న్యూఢిల్లీ, ఆగస్టు 18: తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్‌నారాయణ్ ఝాను విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలకు ముందు చేపట్టవలసిన కనీస పాలనా పద్ధతులను, విధి విధానాలను పాటించనందున వాయిదా వేయాలని మర్రి కోరారు.

08/19/2017 - 01:53

హైదరాబాద్, ఆగస్టు 18: వాటర్ గ్రిడ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులకు అటవీ భూమి బదలాయింపులపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని శుక్రవారం జరిగిన అటవీ శాఖ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని జలపాతాలు ఉన్న చోట పర్యాటకులను ఆకర్శించే విధంగా వౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. అటవీ సంపద రక్షణ, వేట నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

08/19/2017 - 01:52

వికారాబాద్, ఆగస్టు 18: ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు పెట్టుకోకుండా ఆంక్షలు పెట్టి అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహం ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ శాంతిభద్రతల పేరిట రాజ్యాంగం కల్పించిన సమావేశాలు ఆందోళన హక్కులను అడ్డుకునే ప్రయత్నం సరికాదని అభిప్రాయపడ్డారు. మాజీ స్పీకర్ మీరాకుమార్..

08/19/2017 - 01:45

హైదరాబాద్, ఆగస్టు 18: హైదరాబాద్ పాతబస్తీలో అమ్మాయిలు అరబ్బు మృగాళ్ల దాష్టీకానికి బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ మైనర్ బాలికను 65ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకుని ఒమన్ దేశానికి తీసుకెళ్లిన సంఘటన కలకలం రేపుతోంది. పేదరికాన్ని ఆసరా చేసుకుని మైనార్టీ తీరని బాలికలకు వల వేసి అరబ్బు షేక్‌లకు అంటగట్టే బ్రోకర్ల ఆగడాలు ఆగడం లేదు.

08/18/2017 - 23:35

హైదరాబాద్, ఆగస్టు 18: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య విభాగం ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో 34 ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయని, ఈ విషయంలో హైదరాబాద్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో టిహబ్ దేశానికే ఆదర్శప్రాయమని వివరించారు.

08/18/2017 - 23:35

హైదరాబాద్, ఆగస్టు 18: దేశంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీల్లో దాదాపు 450 మంది ప్రభుత్వ, ప్రభుత్వ రంగ అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. వీరిలో 150 మంది బ్యాంకులు, బీమా, పోస్ట్ఫాసు, రైల్వే, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, మరో 300 మంది ప్రైవేట్ వృత్తుల్లో అంటే ట్యాక్స్ కనె్సల్టెంట్లు, అకౌంటెంట్లు, ఆభరణాల వ్యాపారులు తదితరులు ఉన్నారు.

08/18/2017 - 23:34

హైదరాబాద్, ఆగస్టు 18: వస్త్ర తయారీ పరిశ్రమ, వాణిజ్య రంగాన్ని అభివృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు, ప్రోత్సహకాలను ప్రకటించింది. తెలంగాణ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ రాయితీ పథకం-2017 మార్గదర్శకాలను పరిశ్రమలు మరియు వాణిజ్యశాఖ శుక్రవారం విడుదల చేసింది.

08/18/2017 - 23:34

హైదరాబాద్, ఆగస్టు 18: ‘పేపర్ లెస్ పాలన’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే పంచాయతీ రాజ్ శాఖలో ఇక మీదట అన్ని సేవలనూ ఆన్‌లైన్‌లోనే కొనసాగించాలని భావిస్తున్నది.

Pages