S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/18/2017 - 03:55

హైదరాబాద్, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (విజయవాడ), కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం (వరంగల్) ద్వారా జరగాల్సిన సూపర్ స్పెషాలిటీ డిఎం, ఎంసిహెచ్ కోర్సుల కౌన్సిలింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు స్టే మంజూరు చేసింది.

08/18/2017 - 03:52

చౌటుప్పల్, ఆగస్టు 17: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం గురువారం కదిలివచ్చింది. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన కడగంచి రమేష్ అరుణాచల్‌ప్రదేశ్ బిజెపి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతని వివాహం మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గులకు చెందిన విజయతో గురువారం చౌటుప్పల్‌లోని ఎంఆర్‌ఆర్ గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

08/18/2017 - 03:49

సంగారెడ్డి, ఆగస్టు 17: సంగారెడ్డిలో వైద్య కళాశాలకు వెంటనే శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి గురువారం నిర్వహించతలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసారు. పాత బస్టాండ్ సమీపం వద్ద ఉన్న తన స్వగృహం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీతో ఆయన కలెక్టరేట్‌కు బయలుదేరారు.

08/18/2017 - 03:47

పెబ్బేరు, ఆగస్టు 17: ఉపాధ్యాయుల దెబ్బలకు తాళలేక 3వ తరగతి విద్యార్థి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ పరిధిలోని శేర్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఆనంద్ విద్యార్థిని రెండు రోజుల క్రితం పద్యం నేర్చుకొని రమ్మని ఉపాధ్యాయుడు మందలించాడు.

08/18/2017 - 03:47

సిద్దిపేట, ఆగస్టు 17 : తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం కల్వకుంట్ల భగీరథగా మారిందని టిపిసిసి చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతిపై చర్చించేందుకు దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామం వద్ద విలేఖరులతో మాట్లాడారు.

08/18/2017 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 17: భారత ఉప రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎం వెంకయ్యనాయుడుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించనున్న పౌర సన్మానం ఏర్పాట్లను గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ వివరించారు. గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో ఎస్‌పి సింగ్ భేటీ అయ్యారు.

08/18/2017 - 03:43

బాసర, ఆగస్టు 17: అనె్నంపునె్నం ఎరుగని చిన్నారులతో కలిసి ఓ మహిళ బాసర గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం కలకలంరేపింది. రోజువారీ విధుల్లో భాగంగా తాగునీటిని సరఫరా చేసే పంప్‌హౌస్‌కు వచ్చిన సిబ్బంది గోదావరి నదిలో తేలియాడుతున్న మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు.

08/18/2017 - 03:42

హైదరాబాద్/గచ్చిబౌలి, ఆగస్టు 17: శాంతి భద్రతలను కాపాడడంలో దేశానికే ఆదర్శంగా నిలిచారని, తెలంగాణ పోలీస్ అంటే..నెంబర్ ఒన్‌గా కీర్తి చాటుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అత్యాధునిక హంగులతో గచ్చిబౌలిలో నిర్మించిన మాదాపూర్ డిసిపి, ఏసిపి, గచ్చిబౌలి పోలీస్ సముదాయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.

08/18/2017 - 03:40

హైదరాబాద్, ఆగస్టు 17: ఏ దేశమైనా అభివృద్ధి చెందుతూ , ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే శాంతి, భద్రతలవ పరిరక్షణ ఎంతైనా అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజూ అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఎన్ ఎస్ ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్ర సంఘటనల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నాడు హైదరాబాద్‌లో జరిగిన జాతీయ భద్రతపై యువ సమ్మేళన కార్యక్రమానికి రిజిజూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

08/18/2017 - 02:56

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్రంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారం అందించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన పశువులకు కూడా రూ.60 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.

Pages