S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/18/2017 - 02:56

హైదరాబాద్, ఆగస్టు 17: షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కాలపరిమితి ముగిసిన జివోలను సవరించి, కాంట్రాక్ట్ కార్మికులు అందరిని పర్మినెంట్ చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. గురువారం నాడిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్యర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది.

08/18/2017 - 02:55

హైదరాబాద్, ఆగస్టు 17: మీసల్స్- రూబెల్లా టీకాలనును రాష్ట్రంలో కోటి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. తొమ్మిది నెలల నుంచి 15 ఏళ్ల పిల్లలు అందరికీ టీకాలు వేయించనున్నట్టు చెప్పారు.గురువారం టీకాలు వేయడాన్ని ప్రారంభించిన మంత్రి ఐదు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేయనున్నట్టు చెప్పారు.

08/18/2017 - 02:55

హైదరాబాద్, ఆగస్టు 17: సహకార శాఖలో మొదటి, రెండవ స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతుల ప్యానల్‌ను ఖరారు చేసేందుకు శాఖాపరమైన పదోన్నతుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార శాఖ కమిషనర్, సహకార సంఘాల రిజిష్ట్రార్ సభ్య కన్వీనర్‌గా, సభ్యులుగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్, పరిపాలన శాఖ అదనపు కార్యదర్శిని నియమిస్తూ గురువారం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

08/18/2017 - 02:54

హైదరాబాద్, ఆగస్టు 17 : ఉస్మానియా యూనివర్శిటీ పనితీరుపై తొలి రోజు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ (నేక్) బృందం పెదవి విరిచింది. నేక్ గుర్తింపు కోసం గురువారం ఉదయం యూనివర్శిటీని సందర్శించిన బృందం వర్శిటీలోని వివిధ ఫ్యాకల్టీలను సందర్శించింది. ఈ సందర్భంగా కొన్ని ఫ్యాకల్టీల్లో పనితీరుపై నేక్ బృందం సభ్యులు పెదవివిరిచారు.

08/18/2017 - 02:54

హైదరాబాద్, ఆగస్టు 17: డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దూసుకెళ్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరశివారులో పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థి నవ్యంత్ కరీంనగర్ వాసిగా సిట్ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ లింకులు హైదరాబాద్‌కే కాదు..పట్టణాలకు పాకాయి. కాగా డ్రగ్స్ కేసులో అరెస్టయిన విద్యార్థి నవ్యంత్ డ్రగ్స్ మాఫియా కెల్విన్ ముఠాలో కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

08/18/2017 - 02:53

హైదరాబాద్, ఆగస్టు 17: ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ వ్యవసాయ భూముల యజమానులకు ఉపయోగపడే విధంగా మాత్రమే ఉన్నందున కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కొత్త చట్టం తేవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు కేంద్ర వ్యవసాయ భూమి కౌలు హక్కు చట్టం 2016 తరహాలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

08/18/2017 - 02:52

హైదరాబాద్, ఆగస్టు 17: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని పరిపూర్ణంగా సమాయత్తం చేస్తున్నామని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.

08/18/2017 - 02:52

హైదరాబాద్, ఆగస్టు 17: ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ్భారత్ మిషన్‌ను గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లారని కేంద్ర రైల్వేశాఖా సహాయ మంత్రి రాజెన్ గోహైన్ అన్నారు. గురువారం నాడు ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛ భారత్- స్వచ్ఛ రైల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు చక్కగా అమలుచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

08/18/2017 - 00:54

బాసర, ఆగస్టు 17: ప్రసిద్ధ ణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో కేంద్ర, రాష్ట్ర సాంకేతిక, విజ్ఞానశాఖ మంత్రి వై.సుజనాచౌదరి కుటుంబ సమేతంగా గురువారం పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలతో వేదపండితుల మంత్రోచ్చరణాలతో పూర్ణకుంభస్వాగతం పలికారు.

08/18/2017 - 00:54

నిజామాబాద్, ఆగస్టు 17: పేకాట వ్యసనం ఓ పోలీసు అధికారి ప్రాణాల మీదకు తెచ్చింది. సదరు అధికారి పేకాట ఆడుతుండగా, స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేయడంతో, వారికి చిక్కకుండా పారిపోయేందుకు గోడ పైనుండి దూకిన క్రమంలో రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ సంఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Pages