S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/17/2017 - 02:18

హైదరాబాద్: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలను కనుగొనేందుకు వీలుగా త్వరలో డ్రగ్ డిటెక్షన్ కిట్ల పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో బ్రీతింగ్ ఎనాలసిస్ పరికరాలను వాడుతూ, మందుబాబులపై పాయింట్ సిస్టంను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.

08/16/2017 - 03:51

సూర్యాపేట, ఆగస్టు 15: సూర్యాపేట జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్ కార్యవర్గం ఎన్నికల సందర్భంగా అధికార టిఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారిం ది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పబ్లిక్‌క్లబ్ లో జెండా ఆవిష్కరణ జరిపేందుకు ఇరువర్గాల వా రు ఏర్పాట్లు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.

08/16/2017 - 03:48

బాసర, ఆగస్టు 15: బాసర సరస్వతి అమ్మవారి ఉత్సవమూర్తి తరలింపు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రైవేటు పాఠశాలలో సరస్వతిపూజ, అక్షరాభ్యాస పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌పూజారి, సప్తశతి పారాయణదారుడు ప్రవీణ్‌శర్మను దేవాదా య శాఖ అధికారులు సస్పెన్షన్ విధించిన విష యం విదితమే.

08/16/2017 - 03:47

గద్వాల, ఆగస్టు 15: తెలంగాణలోప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం 71వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో మువ్వనె్నల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం మంత్రి ప్రసంగించారు.

08/16/2017 - 03:46

హైదరాబాద్, ఆగస్టు 15: ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో దాదాపు రూ. 4320 కోట్ల మేర ఆదాయాన్ని దక్షిణ మధ్య రైల్వే సాధించినట్లు ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ ప్రకటించారు. సరకుల రవాణా 32.73 మిలియన్‌టన్నులు దాటిందని, 130.67 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానానికి దక్షిణ మధ్య రైల్వే చేరవేసిందని ఆయన చెప్పారు.

08/16/2017 - 03:46

సిద్దిపేట, ఆగస్టు 15 : గత ప్రభుత్వాల హామీలతో నిర్లక్ష్యానికి గురై కుదేలైన మత్స్య శాఖను బలోపేతానికి తెలంగాణ సర్కారు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట కోమటిచెరువు వద్ద మత్స్యశాఖ ఏర్పాటు చేసిన మత్స్యకారుల అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

08/16/2017 - 02:46

మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటుచేసిన ఎట్ హోంలో పాల్గొన్న టి.పిసిసి నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టి.మంత్రులు కెటిఆర్, లక్ష్మారెడ్డి, ఏపి మంత్రి కామినేని శ్రీనివాస్, టి.బిజెపి నేత లక్ష్మణ్, జనసేన నేత, నటుడు పవన్ కల్యాణ్, కాంగ్రెస్ ఎంపి టిఎస్సార్, తెలంగాణ మంత్రులు తలసాని, మహేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డి, తెరాస ఎంపి డిఎస్

08/16/2017 - 02:41

హైదరాబాద్, ఆగస్టు 15: కెసిఆర్ పాలనలో తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బిజెపి కార్యాలయంలో జాతీయ జండాను ఎగురవేసిన అనంతరం కార్యకర్తలను ఉద్ధేశించి బిజెపి అగ్రనేతలు మాట్లాడారు.

08/16/2017 - 02:40

హైదరాబాద్, ఆగస్టు 15: విద్యుత్ సంక్షోభాల నుంచి రాష్ట్రం గట్టెక్కిందని, 2018-19నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రం హోదాను సాధిస్తామని జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందని, 11వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణకు ఉందని ఆయన స్పష్టం చేశారు.

08/16/2017 - 02:38

హైదరాబాద్, ఆగస్టు 15: పోలీస్ శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా పలువురు అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ పతకాలు అందజేసింది. అదనపు డిజిపి (శాంతిభద్రతలు) అంజనీకుమార్, డైరెక్టర్ జనరల్ (అగ్నిమాపక శాఖ) రాజీవ్ రతన్‌లకు ఇండిపెండెన్స్ డే-2016 ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ పురస్కారం లభించింది.

Pages